మరింత చేరువలో మీ సేవా
ABN , Publish Date - Jul 03 , 2024 | 12:09 AM
జిల్లాలో పౌరసేవ లను మరింత సులభతరం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రామా ల్లో మీసేవ కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మహిళా శక్తి పథకం కింద జిల్లాలోని 12 మండలాల పరిధిలో మొత్తం 57 మీసేవ కేంద్రాలను మంజూరు చేసింది.
మహిళా శక్తి పథకం కింద అమలు
గ్రామైక్య సంఘాలకు నిర్వహణ బాధ్యతలు
ఇంటర్ చదివిన వారికి కేటాయింపు
ఇక పల్లెవాసులకు అందుబాటులో పౌరసేవలు
జిల్లాకు 57 కేంద్రాలు మంజూరు
లింగాలఘణపురం, జూలై2 : జిల్లాలో పౌరసేవ లను మరింత సులభతరం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రామా ల్లో మీసేవ కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మహిళా శక్తి పథకం కింద జిల్లాలోని 12 మండలాల పరిధిలో మొత్తం 57 మీసేవ కేంద్రాలను మంజూరు చేసింది. అయితే వీటి నిర్వహణ పూర్తిగా ఆయా గ్రామైక్య సంఘం పరిధి ఎస్‌హెచ్‌జీ గ్రూపులోని సభ్యురాలికి మాత్రమే అప్పగించేందుకు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇంటర్ పాస్ అయిన అభ్య ర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించా రు. ఎంపిక చేసిన గ్రామాల్లో ఒక దరఖాస్తు మాత్ర మే వస్తే వారినే ఎంపిక చేయనుండగా ఒకటికి కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే మాత్రం సంబంధిత గ్రామైక్య సంఘం తీర్మానం మేరకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
గ్రామాలవారీగా వివరాలు..
జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలంలో చిన్నరామచర్ల(వెన్నెల గ్రామైక్య సంఘం), కొన్నె (శ్రీరామ), పడమటి కేశ్వాపూర్(గోదావరి), కేసిరెడ్డి పల్లి(అంజలి), పోచన్నపేట(సిరివెన్నెల), లింగంపల్లి (క్రాంతి), కట్కూరు(మహేశ్వరి), చిల్పూరు మండలం లోని పల్లగుట్ట(అంకిత), చిల్పూరు(కావేరి), లింగం పల్లి(శాంతి), రాజవరం(ఉదయం), దేవరుప్పుల మండలంలో చిన్నమడూరు(క్రాంతి), ధర్మాపురం(స్పందన), కడవెండి(బతుకమ్మ), మాధాపురం(శ్రీదేవి), పెద్దమడూరు(సూర్యోదయ), స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని తానేదార్‌పల్లి( శ్రీవిఘ్నేశ్వర), నమిలిగొండ(శ్రీసాయి), స్టేషన్‌ఘన్‌పూర్(నందిని), మీదికొండ(ఉషోదయ), ఛాగల్(నవోదయ), పాంనూర్(నవ్యశ్రీ), జనగామ మండలం యశ్వం తాపురం(ఐకమత్యం), ఎర్రగొల్లపహాడ్ (సుప్రియ), అడవికే శ్వాపూర్(అరుణోదయ), గానుగుపహాడ్ (మణికంఠ), పెద్దరామచర్ల(నవోద య), శామీర్‌పేట (మహాలక్ష్మి), మరిగడి(నాగమణి), వడ్లకొండ (శ్రీవాణి), పెద్దపహాడ్ (అల్కనంద), కొడకండ్ల మండలంలో ని లక్ష్మక్కపల్లి(శ్రీలక్ష్మి), పాఖాల(చాముండేశ్వరి), ఏడునూతుల(ప్రగతి), లింగాలఘణపురం మండలం లోని చీటూరు(చామంతి), వడ్డిచర్ల (అంకిత), వనప ర్తి(సాయిబాబా),కుందారం(ప్రేమ), నర్మెట మండలం లోని హన్మంతపురం(ఇంద్రధనస్సు), వెల్ధండ(రాణిరు ద్రమదేవి), పాలకుర్తి మండలంలోని విస్నూరు(శ్రీ మంజునాథ), దర్ధేపల్లి(శ్రీచైతన్య), బొమ్మెర(పోతన), వల్మిడి(రామాంజనేయ), చెన్నూరు(సంతోషిమాత), ఈరవెన్ను(సరోజినినాయుడు), రఘునాథపల్లి మండ లంలోని గోవర్థనగిరి(ఆంజనేయ), అశ్వరావుపల్లి(శు భాంజలి), బానాజీపేట(శాంతి), కోమల్ల(వెన్నెల), కుర్చపల్లి(ప్రగతి), మేకలగట్టు(స్నేహ), తరిగొప్పుల మండలంలోని అబ్దుల్‌నాగారం(వెన్నెల), అంకు షాపూర్(మథర్‌థెరిస్సా), జఫర్‌ఘఢ్ మండలంలోని తిమ్మంపేట(ప్రతిభ), తీగారం(ప్రియదర్శిని), ఒబు లాపూర్(సోమేశ్వర) గ్రామాలు ఎంపికయ్యాయి.
గ్రామపంచాయతీల్లో ఏర్పాటు..
మహిళా శక్తి మీసేవ కేంద్రాలను ఆయా గ్రామా ల్లోని ప్రభుత్వ భవనాలు, గ్రామపంచాయతీలు, ప్రభు త్వ పాఠశాలలు, అంగన్‌వాడి కేంద్రాలు, రైతువేదికలు వీటిలో ఏది అనుకూలంగా ఉంటే అందులో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో కేవలం జనగామ మండలం పెద్దపహాడ్, పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామాల్లో మాత్రమే అంగన్‌వాడి భవనాలను ఎంపిక చేయగా మిగతా 55 కేంద్రాలు ఆయా గ్రామాల్లోని గ్రామపంచాయతీ భవనాల్లో నిర్వహించేందుకు అధికారులు అవసర మైన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఎంపికైన లబ్ధిదా రులకు సంబంధిత గ్రామైక్య సంఘం ద్వారా రూ. 2.50 లక్షల రుణసౌకర్యం అందుతుందని అధికారులు చెబుతున్నారు.
వారం రోజుల్లో ఎంపిక ప్రక్రియ
- మొగులప్ప, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
జిల్లాలో 57 మహిళా శక్తి మీసేవ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే ఈ కేంద్రాల ఏర్పాటు పూర్తిగా ఆయా గ్రామైక్య సంఘం పరిధిలో కొనసాగుతుంది. లబ్ధిదారుల ఎంపిక సంబంధిత వీవో తీర్మానం మేరకే జరుగుతుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఒకట్రెండు రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారం రోజుల్లో ఎంపిక ప్రక్రియను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నాం.