Shailajanath: గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలను తప్పుబట్టిన శైలజానాథ్
ABN , First Publish Date - 2023-10-27T15:27:04+05:30 IST
రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు ఉండకూడదని ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ ( Shailajanath ) అన్నారు.
అనంతపురం: రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు ఉండకూడదని ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ ( Shailajanath ) అన్నారు. శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ ( Congress party ) కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) పై హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ ( MP Gorantla Madhav ) చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. చంద్రబాబుని ఇప్పటికే ఆధారాలు లేకుండా జగన్‌రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. గోరంట్ల మాధవ్ గురించి మాట్లాడి వెస్ట్. వైసీపీ ప్రభుత్వానికి సాగు, తాగునీరు విషయంలో సరైన ప్లానింగ్ లేదు. అనంతపురం జిల్లాలో అన్ని చెరువులను నింపాల్సిన అవసరం ఉంది. HLC కాలువ సిస్టమ్ ద్వారా చివరి వరకు నీళ్లు తీసుకెళ్లాలి. PABR డ్యాంలో కేవలం 2.2 TMC నీరు మాత్రమే నిలువ ఉంది. కనీసం 5.5 టీఎంసీల నీరు నిలువ ఉంచుకోవాలి. వైసీపీ నాయకులకు డ్యాంల పట్ల అశ్రద్ధ.. కనీసం క్రస్ట్ గేట్లు కూడా రిపేర్ చేయలేదు. 10 క్యూసెక్కుల నీరు వస్తోందంటే సిగ్గేస్తుంది. చెప్పుకోవడానికి కూడ సిగ్గుండాలి... నీటి వాటా పెంచాలి. ప్రభుత్వం తరఫున స్పందన రాకపోతే జిల్లా కలెక్టర్‌ని కలుస్తాం. అప్పటికీ రాకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు పిలుపునిస్తాం’’ అని శైలజానాథ్ అన్నారు.