BJP: రేపో, మాపో కవిత అరెస్ట్ ఖాయమన్న కోమటిరెడ్డి

ABN , First Publish Date - 2023-03-04T12:28:44+05:30 IST

బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మునుగోడు ఉప ఎన్నికల్లో బయట పడిందని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

BJP: రేపో, మాపో కవిత అరెస్ట్ ఖాయమన్న కోమటిరెడ్డి

తిరుమల: ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam)లో రేపో, మాపో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) అరెస్ట్ అవుతుంది అంటూ బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (BJP Leader Komatireddy Rajagopal Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ (BRS Party)పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మునుగోడు ఉప ఎన్నిక (Munugodu By Poll) ల్లో బయట పడిందని అన్నారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దృష్టి మళ్ళించేందుకే టీఆర్ఎస్ (TRS).. బీఆర్‌ఎస్ (BRS) అయ్యిందన్నారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ బీజేపీ (BJP)పై అసత్య ప్రచారం చేశారని ఆయన మండిపడ్డారు.

ప్రజలు కేసీఆర్ (Telangana CM KCR) అసత్య ప్రచారాన్ని నమ్మలేదన్నారు. కేసీఆర్ (KCR) పాలన పొయ్యి బీజేపీ ప్రభుత్వం (BJP government) అధికారంలోకి వస్తేనే తెలంగాణ రాష్ట్రం (Telangana State) అభివృద్ధి చెందుతుందని తెలిపారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే ధీమా వ్యక్తం చేశారు. రాజకీయంగా తనను ఎదుర్కొలేక తాను అమ్ముడుపొయ్యానంటూ.. కేటీఆర్ (KTR) , రేవంత్ రెడ్డి (Revanth Reddy) కలిసి అసత్య ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘శ్రీవారి సాక్షిగా చెబుతున్నా.. నేను ఎవరికీ అమ్ముడుపోలేదు.. నేను అవినీతి చేసి ఉంటే కేటీఆర్ (Telangana Minister), రేవంత్ రెడ్డి (TPCC Chief) నిరూపించాలి’’ అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సవాల్ విసిరారు.

Updated Date - 2023-03-04T12:28:44+05:30 IST