CPI Narayana: గాడ్సే నోటి నుంచి ఊడిపడిన వ్యక్తి మోదీ

ABN , First Publish Date - 2023-04-21T12:55:52+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

CPI Narayana: గాడ్సే నోటి నుంచి ఊడిపడిన వ్యక్తి మోదీ

తిరుపతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై (PM Narendra Modi) సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Leader Narayana) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై (Congress Leader Rahul Gandhi) మోదీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. దేశానికి సేవ చేసిన నెహ్రూ కుటుంబానికి అడుగడుగునా వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. బీజేపీ (BJP) పెంపుడు కుక్కగా సీబీఐ వ్యవహరిస్తోందని విరుచుకుపడ్డారు. న్యాయవ్యవస్థ మీద మోదీ ప్రభుత్వం ఒత్తిడి పెడుతోందని ఆరోపించారు. గాడ్సే నోటి నుంచి ఊడిపడిన వ్యక్తి మోదీ అంటూ వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను డంప్ కేంద్రంగా మోదీ మార్చుతున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైసీపీ ప్రభుత్వం (YCP Government) ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు. అదానీకి నొప్పి తగలకుండా జగన్మోహన్ రెడ్డి (AP CM) వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మోదీ బాబా 30 దొంగల్లా పాలన సాగుతోందన్నారు. దేశంలో 30 మంది దత్తపుత్రులతో పాలన నడుస్తోందని ఆయన అన్నారు.

విభజన చట్టాలను అమలు చేయించుకోలేని బలహీన స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) రోబో లాంటి వ్యక్తి అని.. ఎలాంటి సెంటిమెంట్స్‌లేని వ్యక్తి అంటూ వ్యాఖ్యలు చేశారు. రాజన్న రాజ్యం అని అధికారంలోకి వచ్చాక దోపిడీ రాజ్యంలా పాలన చేస్తున్నారన్నారు. పుంగనూరు జవాన్‌లా ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలన ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డికి అన్ని తెలిసే జరుగుతున్నాయని తెలిపారు. సీఎంకు ఎలాంటి ఆస్తులు లేకపోతే సంతకం పెట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీతాలు ఇవ్వలేని దివాళా స్థాయిలో ఏపీ ఆర్థిక పరిస్థితి ఏర్పడిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై సజ్జల వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. బాగా సంపాదించిన తిమింగళాలకు సజ్జల కాపలాదారుడని ఆరోపించారు. దోపిడిదారులకు సజ్జల అధికార ప్రతినిధన్నారు. సీఎం కేసీఆర్‌కు ఉన్న కన్సర్న్ కూడా ఏపీలో సీఎం జగన్‌హన్‌రెడ్డికి లేదని నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated Date - 2023-04-21T13:06:57+05:30 IST