Narayanaswamy: చంద్రబాబు పతనం అక్కడే మొదలైంది
ABN , First Publish Date - 2023-09-15T19:35:24+05:30 IST
చంద్రబాబు(Chandrababu) , పవన్ కళ్యాణ్(Pawan Kalyan)లపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి(Deputy CM Narayanaswamy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
చిత్తూరు:చంద్రబాబు(Chandrababu) , పవన్ కళ్యాణ్(Pawan Kalyan)లపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి(Deputy CM Narayanaswamy) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘అవినీతిని కనిపెట్టిన వ్యక్తి చంద్రబాబు.రెండు ఎకరాల భూమి నుంచి లక్షల కోట్ల ఆస్తికి వారసుడయ్యారు ఇదంతా అవినీతి సంపాదన ద్వారానే సాధ్యం అయింది. సినిమాలో నటించి డబ్బులు తీసుకునే తరహాలోనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు తో కలిసి ప్రతి షోకు ప్యాకేజీ తీసుకుంటున్నాడు. ఆ విధంగా ఇద్దరి మధ్య అగ్రిమెంటు కుదిరి .ప్యాకేజీ నడుస్తుంది. చంద్రబాబును జైల్లో వేసినందుకు 80% మంది సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు టార్గెట్ పతనం...పుంగనూరు అల్లర్ల నుంచి మొదలైంది. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రాజకీయ ఎదుగుదలను తట్టుకోలేక పెద్దిరెడ్డిపైన్నే చంద్రబాబు కన్నేశారు. పుంగనూరులో పోలీసులపై దాడులు దౌర్జన్యాలకు పాల్పడి, ఎస్పీని బెదిరించినప్పుడే ఆయనను పెద్దిరెడ్డి టార్గెట్ చేశారు.చంద్రబాబు పతనం అక్కడే మొదలైంది’’ అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు.