Kancherla Srikanth: నారా భువనేశ్వరిని అలా అన్నప్పుడు.. మీరంతా ఎక్కడున్నారు
ABN , First Publish Date - 2023-10-10T21:11:14+05:30 IST
రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని నారా భువనేశ్వరిని వైసీపీ నేతలు అసభ్యంగా ధూషించారని.. అప్పుడు మీరంతా ఎక్కడ ఉన్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ (Kancherla Srikanth) ప్రశ్నించారు.
చిత్తూరు: రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని నారా భువనేశ్వరిని వైసీపీ నేతలు అసభ్యంగా ధూషించారని.. అప్పుడు మీరంతా ఎక్కడ ఉన్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్(Kancherla Srikanth) ప్రశ్నించారు. మంగళవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి రోజను ఒక్కమాట అంటేనే మీడియా ముందు కన్నీరు పెట్టుకుంటేనే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. తెలుగు మహిళలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌కి కౌంటర్ ఇచ్చారు. ఏపీలో ఇప్పుడు జరుగుతున్న అక్రమాలని చూసి అమ్మవారి వేషాధారణతో మొక్కులు చెల్లించేందుకు మహిళలు వెళ్తే వారిని తాగుబోతు మహిళలు అనడం సమాంజసమేనా అని నిలదీశారు. వైసీపీ సోషల్ మీడియా విభాగంలో కన్వీనర్‌గా ఉన్నా రెబల్ శివ అనే వ్యక్తి మహిళల గురించి అసభ్యంగా పోస్టులు పెట్టిన అతని మీద చర్యలు తీసుకొని మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి.
ఈ విషయం మీద కేసు నమోదు చేయకపోతే ఏపీ హైకోరుకు వెళ్లి కేసు వేస్తాం. krj భరత్ అనే పేరుమీద ఉన్నఅకౌంట్‌లో మహిళల మీద అసభ్యంగా పోస్టు పెట్టారని.. పోలీస్ ఫిర్యాదు చేసిన వెంటనే ఆ అకౌంట్‌ను మార్చరని .. పోస్టు పెట్టిన ఆ వ్యక్తిపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని కంచెర్ల శ్రీకాంత్ డిమాండ్ చేశారు.