Anitha: లోకేశ్-పవన్‌ను చూసి వైసీపీలో వణుకు
ABN , First Publish Date - 2023-10-25T14:34:21+05:30 IST
తిరుమలకు వెళ్లిన నారా భువనేశ్వరి తిరుమలలో ఎక్కడ రాజకీయాలు మాట్లాడలేదు. తన భర్తతో, వేంకటేశ్వరస్వామితో తనకు ఉన్న అనుబంధాలను గుర్తుచేసుకున్నారు. అయితే మంత్రి రోజా తిరుమలకు వెళ్లి దేవుడి
తిరుపతి: నిజాలకు ప్రతిరూపం చంద్రబాబు (Chandrababu) అయితే అబద్దాలకు ప్రతిరూపం జగన్ (Cm jagan) అని తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత (Vangalapudi anitha) అన్నారు. నారావారిపల్లెలో అనిత మీడియాతో మాట్లాడుతూ మంత్రి రోజాపై (Roja) మండిపడ్డారు. ‘‘తిరుమలకు వెళ్లిన నారా భువనేశ్వరి తిరుమలలో ఎక్కడ రాజకీయాలు మాట్లాడలేదు. తన భర్తతో, వేంకటేశ్వరస్వామితో తనకు ఉన్న అనుబంధాలను గుర్తుచేసుకున్నారు. అయితే మంత్రి రోజా తిరుమలకు వెళ్లి దేవుడి ఆలయం ముందు నుంచి రాజకీయాలు మాట్లాడి రోజా తన గొయ్య తానే తవ్వుకున్నారు. వెంకన్నతో గేమ్స్ ఆడుకుంటే భవిష్యత్తు ఉండదు. తిరుమల గాలి తగిలితేనే పవిత్రమైన చైతన్యం వస్తుంది. రోజాకు ఎందుకు అలా లేదు అంటే... ఆమెకు వసూళ్లపైన ప్రేమ. ఆమె తిరుమలకు వెళ్లిన ప్రతిసారి ముప్పై టిక్కెట్లు అమ్ముకుంటుందట. చికెన్ కొట్టువాడి నుంచి కిరాణాకొట్టు, మార్బల్ కొట్టు వరకు ఎవరిని వదలకుండా మామూళ్లు తీసుకుంటోంది. నువ్వు చేస్తున్న చిల్లర వ్యాపారంపైన సీబీఐ విచారణ చేయిద్దాం. నిండ్రలో ఎర్రమట్టిపై సీబీఐ విచారణ చేయాలి. రోజా గంజి స్టేజీ నుంచి ఇప్పుడు బెంజి కథ వరకు రాష్ట్రంలో అందరికీ తెలుసు. రోజా చేతివాటం ట్రస్టు పెట్టింది. ఆమె చేతివాటం డబ్బులను ఆ ట్రస్టులో వేస్తోంది. పవన్ కల్యాణ్ (Pawan Kalyan), లోకేశ్ (Nara Lokesh) ఒక ఫ్రేమ్‌లో కన్పిస్తేనే ఇలా వణికి పోతున్నారు. వారు ఇద్దరు రంగంలోకి దిగితే వీరి పరిస్థితి ఏంటీ?.’’ అని అనిత వ్యాఖ్యానించారు.