Nara Lokesh: మా పోరాటం ఆగదు.. మిమ్మల్ని వదిలిపెట్టం

ABN , First Publish Date - 2023-09-11T18:49:45+05:30 IST

‘‘ఎన్నిసార్లు జైలుకు పంపినా మా పోరాటం ఆగదు.. మిమ్మల్ని వదిలిపెట్టం’’ అని వైసీపీ ప్రభుత్వాన్ని(YCP Govt) తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) తీవ్రంగా హెచ్చరించారు.

Nara Lokesh:  మా పోరాటం ఆగదు.. మిమ్మల్ని వదిలిపెట్టం

రాజమండ్రి: ‘‘ఎన్నిసార్లు జైలుకు పంపినా మా పోరాటం ఆగదు.. మిమ్మల్ని వదిలిపెట్టం’’ అని వైసీపీ ప్రభుత్వాన్ని(YCP Govt) తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) తీవ్రంగా హెచ్చరించారు. సోమవారం నాడు రాజమండ్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు అరెస్ట్‌ను ప్రజలంతా ఖండించారు.స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అవినీతి అనేది ఆరోపణే. టీడీపీ ప్రభుత్వంలో లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాం. సీఐడీ అంటే కక్ష సాధింపు డిపార్ట్‌మెంట్‌. చంద్రబాబుపై అవినీతి మరక వేసేందుకు సైకో కుట్రలు చేస్తున్నారు. జగన్‌కు ఉన్న అవినీతి బురదను అందరికీ రుద్దేందుకు కుట్రలకు తెగబడ్డారు.అవినీతి అనేది చంద్రబాబు రక్తంలోనే లేదు. చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేశారు. దొంగ కేసులు పెట్టి జైలుకు పంపారు’’ అని నారా లోకేశ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


నిన్న అమ్మా నాన్నల పెళ్లి రోజు, కుటుంబ సభ్యులతో 5నిమిషాలు కూడా మాట్లాడనివ్వలేదు. చంద్రబాబు జైలుకెళ్లారనే షాక్‌లో మా కుటుంబం ఉందని టీడీపీ నేత లోకేష్ వ్యాఖ్యానించారు. ‘‘నేను 8th క్లాస్ వరకూ నాన్నని ప్రత్యక్షంగా సరిగా చూసింది లేదు.కుటుంబం కంటే ప్రజా సేవకోసమే పరితపించిన నాయకుడిని ఇలా చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం.సైకోతో పోరాడుతున్నప్పుడు ఇవన్నీ తప్పవని మాకు మేము సద్ది చెప్పుకున్నాం.యువగళం పాదయాత్ర, మా నాయకుడి పోరాటానికి ప్రభుత్వం భయపడిందని స్పష్టమయింది. ప్రజా చైతన్యంలో భాగంగా రేపటి నుంచి పార్లమెంట్ పార్టీ సమావేశాలు నిర్వహించుకుంటూ వెళ్తాం.భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికనూ త్వరలోనే ప్రకటిస్తాం. ప్రజలు, రాష్ట్రం దేశం తప్ప వేరే ఏదీ ఆలోచించని నాయకుడు చంద్రబాబు.అవినీతికి ఆస్కారం లేని నేత. ప్రపంచానికి తెలిసిన నాయుడిపై దొంగ కేసులు పెట్టి జైలుకు పంపారు’’ అని లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్‌కు కృతజ్ఞతలు నారా లోకేష్

ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి బంద్‌ని విజయవంతం చేశారు. బంద్‌ విజయవంతంలో సహకారం అందించిన అన్న లాంటి పవన్ కళ్యాణ్, అన్ని రాజకీయ పార్టీలకు నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబుని అక్రమ కేసులో అరెస్టు చేయించిన జగన్ పెద్ద మూల్యం చెల్లించుకోబోతున్నాడు. ఆధారాలు లేని కేసులో అధికార బలం ప్రయోగించి అరెస్టు చేయించాడు. తనపై ఉన్న అవినీతి ముద్ర అందరి నాయకులపై రుద్దే యత్నం చేస్తున్నాడు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో నాడు ప్రధాన భూమిక పోషించిన అధికారులు అజయ్ కల్లం, ప్రేమ్ చంద్రారెడ్డిలు ఇప్పటి ప్రభుత్వంలో సలహాదారులు. వారి పాత్రపై సీఐడీ సమాధానం చెప్పాలి. చంద్రబాబుకి ఏ రూపేణా డబ్బులు వచ్చాయో దమ్ముంటే ప్రభుత్వం నిరూపించాలి. చంద్రబాబుపై దొంగ కేసు పెట్టి మంత్రులు సంబురాలు చేసుకున్నారంటేనే ఎంత కక్ష సాధింపు ఉందో తెలుస్తోంది. సీఐడీ కక్ష సాధింపు విభాగంగా మారిపోయింది.నేను రాజమండ్రిలోనే ఉన్నా, ఎక్కడికీ పారిపోలేదు, నన్నూ అరెస్టు చేయాలనుకుంటే వచ్చి చేసుకోండి. ఎన్ని రోజులు మమ్మల్ని జైల్లో పెట్టుకుంటారో పెట్టుకోండి, నా మా పోరాటం ఆగదు. ఈ ప్రభుత్వాన్ని వెంటాడి అంతు తేల్చేవరకూ నా పోరాటం కొనసాగుతుంది. న్యాయాన్ని నిలబెట్టే ప్రక్రియలో ఎన్ని కుట్రలనైనా ఎదుర్కొంటాం? రిమాండ్ రిపోర్టులో చంద్రబాబుకి ఎక్కడ డబ్బు వచ్చిందో చెప్పలేక పోయారు. మేము ప్రకటిస్తూ వచ్చిన ఆస్తులకంటే అదనంగా ఉంటే ఇప్పటికైనా చూపండి, వారికే ఇచ్చేస్తాం. ప్రజల కోసం చేసే పోరాటంలో చంద్రబాబు అరెస్టు ఓ స్పీడ్ బ్రేకర్ మాత్రమే. స్పీడ్ బ్రేకర్లని తొక్కుకుంటూ ఎలా వెళ్లాలో తెలిసిన పార్టీ తెలుగుదేశం. మేము ఓ నిర్ణయం తీసుకుంటే తొక్కుకుంటూ పోవటమే మాకు అలవాటే.మేము ఒంటరి కాదు, మాది ప్రజాబలం’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-11T19:10:41+05:30 IST