MP Kanakamedala : తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్‌రెడ్డి 43 వేల కోట్లు దోచుకున్నారు
ABN , First Publish Date - 2023-10-07T19:15:29+05:30 IST
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan Reddy) 43 వేల కోట్లు దోచుకున్నారని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్(MP Kanakamedala Ravindra Kumar) ఆరోపించారు.
రాజమండ్రి: తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan Reddy) 43 వేల కోట్లు దోచుకున్నారని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్(MP Kanakamedala Ravindra Kumar) ఆరోపించారు. శనివారం నాడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఈరోజు ములాఖత్‌లో చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా కనకమేడల మీడియాతో మాట్లాడుతూ..‘‘జైల్లో చంద్రబాబు చాలా ధైర్యంగా ఉన్నారు. ఈరోజుకి కూడా స్టేల్ తెచ్చుకుంటూ జగన్మోహన్‌రెడ్డి కాలయాపన చేస్తున్నారు. అలాంటి వ్యక్తి చంద్రబాబు నిజాయితీ గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబుపై చేసిన ఆరోపణలు ఇప్పటివరకు ఒక ఆధారాన్ని కూడా చూపలేకపోయారు. చంద్రబాబుకి ఏ రూపంలో ఎవరి ద్వారా నిధులు ముట్టాయో స్పష్టం చేయాలి. మా పార్టీ ఆడిటర్స్ ద్వారా ప్రతి సంవత్సరం లెక్కలు బహిర్గతం చేస్తాం’’ అని కనకమేడల రవీంద్ర కుమార్ పేర్కొన్నారు.