Chandrababu: అర్థమైందా సైకో జగన్‌రెడ్డీ అంటూ.. రజనీకాంత్ డైలాగులతో పంచులు
ABN , First Publish Date - 2023-09-02T18:59:25+05:30 IST
సైకిల్ స్పీడ్‌తో వైసీపీ ప్రభుత్వాన్ని(YCP Govt) తొక్కించుకుంటూ పోతానని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) హెచ్చరించారు.
కాకినాడ: సైకిల్ స్పీడ్‌తో వైసీపీ ప్రభుత్వాన్ని(YCP Govt) తొక్కించుకుంటూ పోతానని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) హెచ్చరించారు. శనివారం నాడు కాకినాడలో పర్యటించారు. ఈసందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ..‘‘ నా జీవితంలో విధ్వంసకర పాలన, దరిద్రపుగొట్టు పాలనను చూడలేదు. రేషన్ షాపుల్లో సబ్సిడీకి కందిపప్పు ఇచ్చాం. ఇప్పుడు కందిపప్పు డబుల్ డిజిట్ దాటిపోయింది. ఆర్థిక మూలాలపై దాడులు చేస్తున్నారు. అక్రమాలను ఎదిరించి మాట్లాడితే చంపుతున్నారు. నిన్న అమలాపురంలో అరాచకం సృష్టించారు. ఏపీలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్‌ల ఆగడాలు పెరిగిపోయాయి.ఇవన్నీ సరిదిద్దేందుకు ‘‘బాబు ష్యూరిటీ - భవిష్యత్ గ్యారంటీ’’ పేరుతో ముందుకెళ్తాం. ఏపీలో 22 మిలియన్ యూనిట్ల కరెంటు కొరత ఉంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
వైసీపీపై రజనీ డైలాగులతో చంద్రబాబు పంచులు..
కరెంట్ చార్జీల బాదుడుపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు.రజనీకాంత్ డైలాగ్(Rajinikanth dialogue)ను..ప్రస్తావిస్తూ కరెంట్ బాదుడుపై చంద్రబాబు విమర్శలు చేశారు. ‘‘ఈ రోజు చెపుతున్నా.. కరెంట్ కోతలు లేని చోటు లేదు. కరెంట్ బిల్లులపై ప్రభుత్వాన్ని తిట్టని నోరు లేదు.ఈ రెండు జరగని ఊరే లేదు.అర్థమైందా సైకో జగన్‌రెడ్డీ అంటూ చంద్రబాబు రజనీకాంత్ డైలాగ్‌లతో వైసీపీ ప్రభుత్వంపై పంచులు కురిపించారు.