Nimmala Ramanaidu: జగన్‌రెడ్డి క్విడ్‌ప్రోకో.. షెల్ కంపెనీలతో లబ్ధి పొందుతున్నారు
ABN , First Publish Date - 2023-10-06T17:52:43+05:30 IST
క్విడ్ ప్రోకోలు, షెల్ కంపెనీలు, ఇన్ సైడ్ ట్రేడింగ్‌లతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM JAGAN REDDY) లబ్ధిపొందుతున్నారని, తన పార్టీని కూడా అలాగే నిలబెట్టేందుకు అన్నీ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) ఆరోపించారు.
అమరావతి: క్విడ్ ప్రోకో, షెల్ కంపెనీలు, ఇన్ సైడ్ ట్రేడింగ్‌లతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM JAGAN REDDY) లబ్ధిపొందుతున్నారని, తన పార్టీని కూడా అలాగే నిలబెట్టేందుకు అన్నీ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) ఆరోపించారు. శుక్రవారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘తప్పుడు సమాచారంతో.. అటున్యాయస్థానాలను, ఇటు ప్రజలను నమ్మించేందుకు జగన్‌రెడ్డి తాపత్రయపడుతున్నాడు. ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్లోని సమాచారం ఆధారంగా టీడీపీకి వచ్చిన విరాళాల సొమ్ముని అవినీతి సొమ్మని చెప్పడం జగన్ రెడ్డి లాంటి అవినీతి పరుడికే చెల్లింది. తెలుగుదేశం పార్టీ పుట్టుక.. వైసీపీ మాదిరిగా అవినీతి నుంచి..అక్రమార్జన నుంచి జరిగింది కాదు. ప్రజలసొమ్ము కొట్టేసిన వారి మధ్ధతుతో వైసీపీ లాగా టీడీపీ పుట్టలేదు. రాష్ట్రవ్యాప్తంగా 1300 బ్యాంక్ ఖాతాల ద్వారా, 60లక్షలకు పైగా క్రియాశీల సభ్యులైన కార్యకర్తల ద్వారా తెలుగుదేశం పార్టీకి సభ్యత్వరుసుముల రూపంలో నిధులు వచ్చాయి. ఆ నిధులు వివరాలన్నీ ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ పూర్తి పారదర్శకతతో ప్రజలముందు, ఎన్నికల కమిషన్ మందు ఉంచుతోంది. టీడీపీతో పోలిస్తే, సరైన కార్యకర్తలే లేని వైసీపీ.. విరాళాల సేకరణలో జాతీయ స్థాయిలో 5వ స్థానంలో.. ప్రాంతీయ పార్టీల జాబితాలో అగ్రస్థానంలో ఎలా నిలిచిందో జగన్‌రెడ్డికే తెలియాలి. జిందాల్ స్టీల్స్.. మెగా ఇంజనీరింగ్ కంపెనీ.. హెటిరో డ్రగ్స్ వంటి సంస్థలు జగన్‌రెడ్డి సంస్థకు చెందిన ఫుడెంట్ ట్రస్ట్‌కు చేసిన చెల్లింపులపై జగన్‌రెడ్డి ఏం సమాధానం చెబుతాడు? విశాఖ వైసీపీ ఎంపీ ఎం.వీ.సత్యనారాయణ గతంలో మొత్తం రూ.11కోట్లను రెండు దఫాల్లో ఫ్రుడెంట్ ట్రస్ట్‌కు విరాళంగా అందిస్తే, నేడు జగన్‌రెడ్డి అతనికి విశాఖపట్నంలో దోపిడీకి అవకాశమిచ్చింది నిజం కాదా? వైసీపీ ఎమ్మెల్యే శంకర్రావు గతంలో తన రియల్ ఎస్టేట్ సంస్థ ద్వారా జగన్ సంస్థకు రూ.1.35కోట్లు విరాళంగా ఇచ్చింది నిజంకాదా’’ అని నిమ్మల రామానాయుడు నిలదీశారు.