CM Jagan: చంద్రబాబు, పవన్‌పై సీఎం జగన్ హాట్ కామెంట్స్... వీళ్లు కలిసేది ఎందుకో తెలుసా అంటూ...

ABN , First Publish Date - 2023-05-16T12:41:47+05:30 IST

జిల్లాలో జరిగిన మత్స్యకారుల సభలో టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

CM Jagan: చంద్రబాబు, పవన్‌పై సీఎం జగన్ హాట్ కామెంట్స్... వీళ్లు కలిసేది ఎందుకో తెలుసా అంటూ...

బాపట్ల: జిల్లాలో జరిగిన మత్స్యకారుల సభలో టీడీపీ చీఫ్ చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu), జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై (Janasean Chief Pawan Kalyan) ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM YS Jaganmohan Reddy)తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలకు మేలు చేస్తుంటే కొందరు తట్టుకోలేక పోతున్నారన్నారు. గత పాలకులు, వారికి మద్దతు ఇస్తున్న వారు తట్టుకోలేక పోతున్నారని విమర్శించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు బాగుండాలని పని చేస్తున్నానని... కానీ చంద్రబాబుకు ఎన్నికలకు ముందు మాత్రమే వారు గుర్తుకు వస్తారన్నారు. చంద్రబాబుకు, తనకు ఉన్న తేడాను ప్రజలు గుర్తించాలని అన్నారు. ‘‘నేను మిమ్మల్ని, దేవుడిని మాత్రం నమ్ముకున్నా... ప్రజలకు మంచి చేయని చంద్రబాబు, దత్తపుత్రుడు పొత్తులను నమ్ముకున్నారు. పొత్తులను, ఎత్తులను, జిత్తులను, కుట్రలను నమ్ముకున్నారు. 14 ఏళ్ల సీఎం గా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీం కూడా గుర్తు రాదు. కేవలం చంద్రబాబు అంటే వెన్నుపోటు మాత్రమే గుర్తుకు వస్తుంది. దత్తపుత్రుడు రెండు సినిమాల మధ్య విరామంలో వస్తారు. విరామంలో వచ్చి పొలిటికల్ మీటింగ్ పెట్టి వెళ్తారు. చంద్రబాబు స్క్రిప్టు ప్రకారం మీ బిడ్డపై నాలుగు రాళ్లు వేసి పోతాడు. ఇలాంటి వారు ప్రజలకు మేలు చేస్తారా ఆలోచించాలి. అధికారంలో ఉంటే అమరావతి, అధికారంపోతే హైదరాబాద్, జూబ్లీహిల్స్ వారికి నివాసం. పదవి లేకపోతే ఇక్కడ ఉండాలనే ఆలోచన కూడా వీరికి తట్టదు. నేను ప్రతిపక్షంలో ఉండగా తాడేపల్లిలో ఇళ్లు కట్టుకున్న. చంద్రబాబు మాత్రం సీఎంగా ఉండగా హైదరాబాద్‌లో ప్యాలెస్ కట్టుకున్నాడు. మన రాష్ట్రంలో దోచుకోవటం, దోచుకున్నది పంచుకుని హైదరాబాద్‌లో ఉండడం వీరి పని’’ అంటూ సీఎం మండిపడ్డారు.

ఆ నమ్మకం చంద్రబాబుకే లేదు...

ప్రధాని, రాష్ట్రపతులను తానే చేశానని చెప్పే చంద్రబాబుకు 175 నియోజకవర్గాలలో బరిలోకి దిగే సత్తా లేదన్నారు. కనీసం 175 స్థానాల్లో చంద్రబాబు పార్టీ రెండో స్థానం కూడా వస్తుందా అని నమ్మకం కూడా చంద్రబాబుకు లేదని తెలిపారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి పెట్టలేని వారు ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. చంద్రబాబు సభలు మైదానాల్లో పెడితే జనం రావడం లేదని సందులలో గొందులలో పెడుతున్నారని విమర్శించారు. జనం చనిపోతున్నా కనీసం పట్టించుకోవడం లేదని ఆత్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పార్టీ వెంటిలేటర్‌పై ఉందని.. అందుకే దత్తపుత్రుడుని నమ్ముకున్నారన్నారు. ఇదే దత్తపుత్రుడిని జనం ఎమ్మెల్యేగా కూడా పనికిరారని ఓడించారని అన్నారు. ఒక్కో ఎన్నికకు ఒక రేటుకు పార్టీని అమ్ముకుంటారని... హోల్ సేల్‌గా పార్టీని అమ్ముకుంటారని వ్యాఖ్యలు చేశారు. వీల్లంతా కలిసేది ఎందుకో ప్రజలు ఆలోచించాలన్నారు. రాష్ట్రాన్ని గజదొంగల మాదిరిగా దోచుకుని పంచుకోవటానికి వీరంతా కలుస్తున్నారని ముఖ్యమంత్రి దుయ్యబట్టారు.

పెళ్లి చేసుకునేది వాళ్లే.. విడాకులు ఇచ్చేది వాళ్లే...

జగన్ ఇంకా మాట్లాడుతూ... ‘‘మీ బిడ్డకు మీరు తోడుగా నిలబడండి. నేను కేవలం మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాను. నేను కేంద్రంలో ఎవరిని కలిసినా ప్రజల కోసమే. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నది వీల్లే. పెళ్లి చేసుకున్నది వీల్లే.. విడాకులు ఇచ్చేది వాళ్లే..మళ్లీ పెళ్లి చేసుకున్నది వీల్లే.. మళ్లీ విడాకులు ఇచ్చేది వీల్లే. చంద్రబాబు కలిసి వెల్దాం అన్నారు... దత్తపుత్రుడు చిత్తం ప్రభు అన్నారు. చంద్రబాబుకు ఏది మంచి జరిగితే అలాగే చేస్తానని దత్తపుత్రుడు చెబుతారు. పోటీ వద్దని చెబితే అలాగే చేస్తాడు. చంద్రబాబు గాజువాక రానంటారు, దత్తపుత్రుడు మంగళగిరిలో పోటీ పెట్టకుండా ఆగుతాడు. చంద్రబాబు చెబితే బీజేపీతో దత్తపుత్రుడు తెగదెంపులు చేసుకుంటారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీల కోసం దత్తపుత్రుడు ఏం చేయటానికైనా వెనకాడరు. ఇలాంటి అన్యాయమైన రాజకీయాలు చేయటానికి వారితో పాటు గజ దొంగల ముఠా సిద్ధంగా ఉంటుంది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే అది చంద్రబాబు విజయం అన్నట్లు రాతలు రాస్తారు. కర్ణాటకలో ఓడిన బీజేపీని ఇక్కడ పొత్తులకు ఆహ్వానిస్తారు. వారు చేసే యుద్ధం జగనతో కాదు జనంతో యుద్ధం చేస్తున్నారు. రాష్ట్రాన్ని దోచుకోవటం, పంతికోవట, దాచుకోవడం వీరి ఎజెండా’’ అంటూ సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-05-16T12:42:12+05:30 IST