Cm Jagan: డాక్టర్ల కోసం ప్రజలు వెళ్లాల్సిన అవసరం లేదు..డాక్టర్లే మీ ఇంటి వస్తారు..

ABN , First Publish Date - 2023-04-06T13:14:12+05:30 IST

జిల్లాలోని చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి(CM YS Jagan Mohan Reddy) గురువారం పర్యటించారు.

Cm Jagan: డాక్టర్ల కోసం ప్రజలు వెళ్లాల్సిన అవసరం లేదు..డాక్టర్లే మీ ఇంటి వస్తారు..

పల్నాడు: జిల్లాలోని చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి(CM YS Jagan Mohan Reddy) గురువారం పర్యటించారు. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం జగన్(Cm Jagan) ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ..‘‘ పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది కూడదు. ప్రతీ ఒక్కరికీ భరోసా కల్పిస్తున్న పథకం ఇది. గ్రామాల్లో ఉచితంగా ఆధునిక వైద్యం అందించే పథకం. డాక్టర్ల కోసం ప్రజలు వెళ్లాల్సిన అవసరం లేదు..డాక్టర్లే మీ ఇంటి దగ్గరకు వస్తారు. మందులు కూడా ఉచితంగా అందించే..గొప్ప కాన్సెప్ట్.. ఫ్యామిలీ డాక్టర్ పథకం. పెన్షన్లు ఏవిధంగా మీ ఇంటికే వస్తున్నాయో అదే విధంగా డాక్టర్ మీ ఇంటికొస్తాడు. దేశం మొత్తం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‎ను(Family doctor concept) కాపీ కొడతారు. ప్రతి ఒక్కరికి రక్షణ కవచంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నిలబడుతుంది. పేదవాడి ప్రాణాలు గాల్లో దీపం అన్న నానుడి మార్చిన ఘనత వైఎస్స్ దే. ఆరోగ్య శ్రీని పద్ధతి ప్రకారం నీరు గార్చారు. వెయ్యి జబ్బులకు మాత్రమే కట్టడి చేశారు.నెట్ వర్క్స్ ఆసుపత్రులకు రూ. 800 కోట్లు బకాయిలు పెట్టారు.ఈ ప్రభుత్వంలో రూ. 9000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. వైద్య ఆరోగ్య శాఖలో 48,639 ఉద్యోగాలిచ్చాం. గతానికి ప్రస్తుతానికి తేడా చూడండి. వందకి వంద శాతం ఖాళీలు భర్తీ చేశాం’’ అని సీఎం జగన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ మంత్రి విడదల రజనీ(Medical Minister Vidada Rajani) తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-06T13:14:24+05:30 IST