Share News

Devineni Uma: బాబు కేసులో న్యాయమే గెలుస్తుంది

ABN , First Publish Date - 2023-10-31T14:45:43+05:30 IST

ఏపీ హైకోర్టు ( AP High Court ) ఉత్తర్వులు ప్రకారం ఏసీబీ కోర్టు ( ACB Court ) లో పత్రాలు సమర్పించామని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ( Devineni Umamaheswara Rao ) అన్నారు.

Devineni Uma: బాబు కేసులో న్యాయమే గెలుస్తుంది

అమరావతి: ఏపీ హైకోర్టు ( AP High Court ) ఉత్తర్వులు ప్రకారం ఏసీబీ కోర్టు ( ACB Court ) లో పత్రాలు సమర్పించామని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ( Devineni Umamaheswara Rao ) అన్నారు. మంగళవారం నాడు ఏసీబీ కోర్టు వద్ద దేవినేని మీడియాతో మాట్లాడుతూ...‘‘జైలు అధికారులకు కోర్టు ఆదేశాలు కూడా అందాయి. కడిగిన ముత్యంలా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu ) బయటకి వస్తారు. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ యాత్రలో ఉన్న చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేశారు. అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయడానికి వస్తే సీబీఐని అడ్డుకున్నారు. తల్లి అనారోగ్యం పేరు చెప్పి అవినాష్‌రెడ్డిని కాపాడారు. ఇదే పోలీసులు అవినాష్‌రెడ్డికి అండగా నిలిచారు. చంద్రబాబుపై ఆధారాలు లేకుండా కేసులు పెట్టారు. నిన్న కూడా మద్యం కంపెనీలపై ఒక కేసు పెట్టారు. లక్ష కోట్లును జగన్ మద్యం ద్వారా దోచుకుని తాడేపల్లి ప్యాలెస్‌లో దాచాడు. జగన్ తన అనుయాయులుతోనే చంద్రబాబుపై కేసులు పెట్టించాడు. అంగళ్లు వెళ్తే గొడవ చేసి.. వారే చంద్రబాబుపై కేసు పెట్టారు. రోడ్డు లేని ఇన్నర్ రింగ్ రోడ్డుపై ఒక కేసు పెట్టారు. గౌతంరెడ్డితో ఏపీ ఫైబర్ నెట్ స్కాం అని కేసు పెట్టించారు. ఇలా ఎన్ని కేసులు పెట్టినా న్యాయం గెలుస్తుంది. నిజమే గెలవాలి అని నారా భువనేశ్వరి పెట్టిన కార్యక్రమం ద్వారా నిజమే గెలిచింది. చంద్రబాబు రోడ్డు మార్గంలో గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు’’ అని దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు.

Updated Date - 2023-10-31T14:45:43+05:30 IST