Dhulipalla Narendra: వైఎస్సారే చంద్రబాబుపై కేసులు ఉపసంహరించుకున్నారు

ABN , First Publish Date - 2023-09-11T20:18:38+05:30 IST

దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డే( YS Rajasekhar Reddy) తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu)పై కేసులు పెట్టి ఉపసంహరించుకున్నారని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్(Dhulipalla Narendra Kumar) వ్యాఖ్యానించారు.

Dhulipalla Narendra:  వైఎస్సారే చంద్రబాబుపై కేసులు ఉపసంహరించుకున్నారు

అమరావతి: దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డే(
YS Rajasekhar Reddy) తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu)పై కేసులు పెట్టి ఉపసంహరించుకున్నారని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్(Dhulipalla Narendra Kumar) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ..‘‘జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి రాష్ట్రంలో విషసంస్కృతికి తెరలేపారు.ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు.రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పాటుపడిన చంద్రబాబునాయుడిపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గం. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు పెట్టడం చంద్రబాబు చేసిన తప్పా? మానవ వనరుల అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ను మొదటి స్థానంలో నిలబెట్టాలన్నదే చంద్రబాబు నాయుడి లక్ష్యం.

రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీమెన్స్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్య 2.13 లక్షల మందికి ట్రైనింగ్ ఇస్తే.. జగన్‌రెడ్డి ప్రభుత్వం కేవలం 21 వేల మందికి మాత్రమే శిక్షణ ఇచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం జరిగితే సీమెన్స్ ప్రాజెక్టుని ఉపయోగించుకుని 21 వేల మంది విద్యార్థులకు ఏ విధంగా శిక్షణ ఇవ్వగలిగారు? గుజరాత్‌ను సందర్శించిన రాష్ట్ర అధికారుల బృందం అక్కడ సీమెన్స్ ప్రాజెక్టుకు అడ్వాన్స్‌గా ముందుగానే ఒకే దఫాలో నిధులు చెల్లిస్తున్నారని నివేదిక ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఈ వాస్తవాలను సీఐడీ ఎందుకు తొక్కిపెడుతోంది’’ అని ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు.

Updated Date - 2023-09-11T20:18:38+05:30 IST