Share News

Pattabhiram: జగన్‌రెడ్డి ఇసుకమాఫియాతో చేరి వేలకోట్లు దిగమింగారు

ABN , First Publish Date - 2023-11-02T22:39:44+05:30 IST

జగన్‌రెడ్డి ( Jagan Reddy ) ఇసుకమాఫియాతో చేరి వేలకోట్లు దిగమింగారని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ( Kommareddy Pattabhiram ) అన్నారు.

Pattabhiram:  జగన్‌రెడ్డి ఇసుకమాఫియాతో చేరి వేలకోట్లు దిగమింగారు

అమరావతి: జగన్‌రెడ్డి ( Jagan Reddy ) ఇసుకమాఫియాతో చేరి వేలకోట్లు దిగమింగారని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ( Kommareddy Pattabhiram ) అన్నారు. గురువారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ఇసుకను ప్రజలకు ఉచితంగా అందించడమే ఈ ప్రభుత్వం దృష్టిలో చంద్రబాబు చేసిన నేరామా..? జగన్‌రెడ్డి తన ఇసుకదోపిడీని చంద్రబాబు ప్రజలకు వివరించాడన్న అక్కసుతో.. టీడీపీ జగన్ సాగిస్తున్న ఇసుకదోపిడీపై సీబీఐ విచారణ కోరిందన్న దుగ్ధతోనే... జగన్ తాజాగా చంద్రబాబుపై ఇసుకకు సంబంధించి తప్పుడు కేసు పెట్టించాడు. ఇసుక రీచ్‌లను డ్వాక్రాసంఘాలకు అప్పగించి, మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చంద్రబాబు గతంలో తీసుకున్న నిర్ణయాన్ని కూడా జగన్ తప్పుపట్టాడు. డ్వాక్రా సంఘాలపై కూడా తప్పుడు ఆరోపణలు చేయడంతో, టెండర్ల విధానానికి శ్రీకారం చుడితే ఆ విధానంపై కూడా జగన్‌రెడ్డి, వైసీపీ నేతలు బురదజల్లారు. చివరకు ప్రజలకు ఉచితంగా ఇసుకను అందివ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకుంటే.. ఈ సైకోరెడ్డి నాలుగున్నరేళ్ల తర్వాత ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ..ఇప్పుడు చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టించాడు’’ అని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు.

లారీ ఇసుక రూ. 40 నుంచి రూ.50 వేలకు అమ్ముతారా..? : పట్టాభిరామ్

‘‘చంద్రబాబునాయుడు ప్రజలకు ఉచితంగా ఇసుక అందివ్వడం అన్యాయమా..? ఈ సైకో ముఖ్యమంత్రి.. ఇసుకదోపిడీతో రూ.40వేలు కోట్లు మింగేయడం న్యాయమా..? గతంలో టీడీపీ ప్రభుత్వంలో రూ.1200 నుంచి రూ.1500లకు దొరికిన ట్రాక్టర్ ఇసుకను ఈ ఇసుకాసురుడు రూ.5 వేల నుంచి రూ.8 వేలకు అమ్మడం న్యాయమా..? లారీ ఇసుకను రూ. 40 నుంచి రూ.50 వేలకు అమ్ముకోవడం ధర్మమా..?లక్షలాది నిర్మాణ రంగా కార్మికులను తన ఇసుక దోపిడీకి బలిచేసి వారి కుటుంబాలను రోడ్డున పడేయడం న్యాయమా..? ఇసుకదోపిడీలోమునిగి తేలుతూ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి.. ఇతర మంత్రులు.. వైసీపీ నేతలు ఇతర రాష్ట్రాలకు అక్రమంగా ఇసుకను తరలించి జేబులు నింపుకోవడం న్యాయమా..? గత ప్రభుత్వంలో జరిగిన ఇసుక తవ్వకాలకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చిన తుది నివేదికను చదవకుండా వెంకటరెడ్డి చంద్రబాబుపై తప్పుడు ఫిర్యాదు చేశాడు. వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా సాగుతున్న ఇసుకతవ్వకాలపై ఎన్.జీ.టీ ఇచ్చిన ఆదేశాలు వెంకటరెడ్డికి.. మంత్రి పెద్దిరెడ్డికి కనిపించలేదా..? చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టి..చంకలు గుద్దుకుంటున్న అవినీతి తిమింగలం వెంకటరెడ్డిని, అతన్ని ఆడిస్తున్న పెద్దిరెడ్డి, ఇసుకాసురుడు జగన్‌రెడ్డిని వదిలే ప్రసక్తే లేదు’’ అని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-11-02T22:45:58+05:30 IST