Nara Bhuvaneshwari: బెయిల్‌పై విడుదలైన యువగళం వలంటీర్లకు పరామర్శ
ABN , First Publish Date - 2023-10-07T19:07:20+05:30 IST
యువగళం కార్యక్రమానికి భద్రత ఇచ్చారనే కారణంతో యువగళం వలంటీర్ల(Yuvagalam volunteers)ను జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేసింది. కాగా ఆ కార్యకర్తలకు కోర్టు బెయల్ ఇచ్చింది.
అమరావతి: యువగళం కార్యక్రమానికి భద్రత ఇచ్చారనే కారణంతో యువగళం వలంటీర్ల(Yuvagalam volunteers)ను జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేసింది. కాగా ఆ కార్యకర్తలకు కోర్టు బెయల్ ఇచ్చింది. బెయిల్‌పై విడుదలైన యువగళం వలంటీర్లను నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) శనివారం నాడు పరామర్శించారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘యువగళం వాలంటీర్ల రుణం తీర్చుకోలేనిది. ఎంతో భవిష్యత్ ఉన్న యువకులపై అక్రమంగా హత్యాయత్నం కేసులు పెట్టారు. లోకేశ్‌తో పాటు యువగళం పాదయాత్రలో సాగుతున్నారనే కారణంతో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపింది. 43 మంది వలంటీర్లపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారు. వలంటీర్ల కష్టం, త్యాగం ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటాం’’ అని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.