CBN Case : రేపు సుప్రీంకోర్టులో 17ఏ పై చారిత్రాత్మక తీర్పు!
ABN , First Publish Date - 2023-10-12T17:22:55+05:30 IST
రేపు సుప్రీంకోర్టు(Supreme Court)లో చంద్రబాబు కేసులో 17A పై చారిత్రాత్మక తీర్పు రాబోతుందని ..
ఢిల్లీ : టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై శుక్రవారం నాడు (అక్టోబర్-13న) చరిత్రాత్మక తీర్పు రాబోతోందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ చెప్పారు. గురువారం నాడు ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడిన లోకేష్.. చంద్రబాబుపై ఏపీ సీఐడీ పెట్టిన అక్రమ కేసులో 17A పై చారిత్రాత్మక తీర్పు రాబోతుందన్నారు. ఈ సందర్భంగా నిన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జరిగిన భేటీలో చర్చకొచ్చిన విషయాలను సైతం మీడియాకు నిశితంగా వివరించారు.
లోకేష్ ఏం చెప్పారు..?
‘‘శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి. పోలీసు, సీఐడీ కూడా అమిత్‌షా కు మా పార్టీ ఎంపీలు లేఖ రాశారు. చంద్రబాబుపై వైసీపీ పార్టీ నేతలు అవినీతి ఆరోపణలు చేశారు ప్రజలు దాన్ని నమ్మడం లేదు. రేపు సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణకు రానున్నది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై ఉన్న కేసుల విచారణకు రాకుండా 2700 సార్లు కోర్టులను వాయిదా కోరారు. చంద్రబాబుకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ తీర్పు దశాబ్దాల పాటు నిలిచి ఉంటుంది. ఏపీ సీఐడీ అధికారులు టీడీపీ బ్యాంకు అకౌంట్స్ అడిగారు. సీఐడీ మా అమ్మ గారి ఇన్కమ్ టాక్స్ డీటైల్స్ అడిగారు. కేసులో మా అమ్మ నిందితురాలు కాదు.. టీడీపీ ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమికి సమాన దూరంలో ఉన్నాము. మేము దూరంగా ఉన్నప్పుడు వాళ్లు మాకు గట్టి మద్దతు ఎలా అశిస్తాము. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ఇండియా కూటమి, ఎన్ డీఏకు చెప్పినప్పుడు విన్నారు. పవన్ కళ్యాణ్ ఏపీకి వస్తుంటే విమానానికి అనుమతి కూడా ఇవ్వలేదు’ అని లోకేష్ తెలిపారు.
గతంలో ఇలా..?
‘ నేను రోడ్డుపై వస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌లో అన్యాయం జరిగింది కాబట్టే అందరూ మద్దతు ఇస్తున్నారు. 17A యడ్యూరప్ప కేసులో వర్తిసుందని అమిత్ షా చెప్పారు. టీడీపీ క్యాడర్ బేస్డ్ పార్టీ. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ప్రభావం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు ఇతర ప్రాంతాల్లో ఎఫెక్ట్ ఉంది. నేను ఏపీపై ఫోకస్ పెట్టాను.. యువగళం పాదయాత్ర కూడా జరుగుతుంది. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. ప్రభుత్వంపై సోషల్ మీడియాలో ఎవరు కామెంట్ చేసినా కేసు పెడుతున్నారు. అమర్ రాజా బ్యాటరీ కంపెనీ తెలంగాణకు వెళ్లిపోయింది. ఏపీలో అత్యధికంగా ఆదాయ పన్ను చెల్లించే కంపెనీ అమర్ రాజా బ్యాటరీనే. చంద్రబాబుపై నాలుగు కేసులు నమోదు చేశారు. అందులో ఒకటి హత్యాయత్నం కేసు కూడా పెట్టారు. టీడీపీపై జగన్ రాజకీయ కక్ష్య సాధింపు చర్యలు చేపడుతున్నారు. అవినీతి ఒక వేళ జరిగితే ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేయాలి కానీ సీఐడీ ఎలా ? చేస్తోంది. పార్టీ అకౌంట్స్‌లో ఉన్న నిధులు ఎలక్టోల్ బాండ్స్ ద్వారా వచ్చాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు విచారణలో 50 ప్రశ్నలు అడిగారు’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.