Pattabhi Ram: చంద్రబాబు ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉంది
ABN , First Publish Date - 2023-10-27T17:16:31+05:30 IST
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) ఆరోగ్యం గురించి మొదట నుంచి మేము ఆందోళన వ్యక్తపరుస్తున్నామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పట్టాభిరాం ( Pattabhi Ram ) అన్నారు.
అమరావతి: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) ఆరోగ్యం గురించి మొదట నుంచి మేము ఆందోళన వ్యక్తపరుస్తున్నామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పట్టాభిరాం ( Pattabhi Ram ) అన్నారు. శుక్రవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘సెంట్రల్ జైలు పరిసర ప్రాంతాల్లో డ్రోన్ వచ్చిందని సాక్షాత్తు జిల్లా శాఖ డీజీ స్వయంగా ధ్రువీకరించారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి సరైన సమాచారం ఇవ్వడం లేదు. సాక్షాత్తు ప్రభుత్వ వైద్యులే చంద్రబాబు ఆరోగ్యం కొంత ఇబ్బందుల్లో ఉందని తెలిపారు. వైద్యులు ఇచ్చిన నివేదికను ఎందుకు తొక్కి పెడుతున్నారు. చంద్రబాబు ఛస్తాడని హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. రెండేళ్ల క్రితం గోరంట్ల మాధవ్ బాగోతం వీడియోల రూపంలో చూశారు. గోరంట్ల మాధవ్ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు తగిన మూల్యం చెల్లించుకుంటాడు. ఎన్ని కుట్రలు చేసిన సమర్థవంతంగా వాటిని ఎదుర్కొంటాం. ప్రజాస్వామ్యబద్ధంగా చంద్రబాబును జగన్‌రెడ్డి ఎదుర్కొనలేక అక్రమంగా రాజమండ్రి సెంట్రల్ జైలులో నిర్బంధించి ఇబ్బందుకు గురి చేస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యం, భద్రతపై న్యాయస్థానాలు తక్షణమే దృష్టి సారించాలి. అవసరమైతే వేరే ప్రాంతానికి తరలించి వేరే కట్టుదిట్టమైన భద్రత ప్రదేశంలో ఉంచాలి’’ అని పట్టాభి రాం పేర్కొన్నారు.