Peetala Sujatha: నాసిరకం మద్యం పంపిణీ చేస్తూ జగనన్న సురక్ష ఎలా సాధ్యం?

ABN , First Publish Date - 2023-10-07T19:32:59+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తీసుకొచ్చింది జగనన్న సురక్ష కాదు.. ప్రజలను శిక్షించే కార్యక్రమం అని మాజీ మంత్రి పీతల సుజాత(Peetala Sujatha) వ్యాఖ్యానించారు.

Peetala Sujatha: నాసిరకం మద్యం పంపిణీ చేస్తూ జగనన్న సురక్ష ఎలా సాధ్యం?

అమరావతి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తీసుకొచ్చింది జగనన్న సురక్ష కాదు.. ప్రజలను శిక్షించే కార్యక్రమం అని మాజీ మంత్రి పీతల సుజాత(Peetala Sujatha) వ్యాఖ్యానించారు. శనివారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ..‘‘ వైసీపీ ప్రభుత్వం అన్నివిధాలా వైద్యరంగాన్ని భ్రష్టు పట్టించింది. ఒక పక్క నాసిరకం మద్యాన్ని ప్రజలకు అందిస్తూ.. మరోపక్క సురక్ష అంటూ ప్రచారా ఆర్భాటానికి జగన్‌రెడ్డి తెరతీశారు. సురక్ష కార్యక్రమంలో విధులు నిర్వహించే ఆశా సిబ్బందిని... వైద్యఆరోగ్య సిబ్బందినే రక్షించలేని సీఎం... ప్రజలను రక్షిస్తాడా? అవినీతితో కుళ్లిపోతూ.. రాజకీయ కక్షతో రగిలిపోతున్న వైసీపీ నేతలు, ముఖ్యమంత్రికే సురక్ష పథకం చాలా అవసరం.

రాష్ట్రంలో ప్రజలు రోగాలపాలు కావడానికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఆస్పపత్రుల పాలవడానికి ప్రధాన కారణం జగన్‌రెడ్డి అమ్మతున్న జేబ్రాండ్ మద్యమే. జే బ్రాండ్ మద్యంతో నాలుగున్నరేళ్లలో లక్షలాది ప్రజలు ఆస్పత్రుల పాలైతే, వేలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నాసిరకం మద్యంతో మహిళల తాళిబొట్లు తెంచుతున్న జగన్‌రెడ్డి.. తమ ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తాడంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మద్యం అమ్మకాలతో రూ.94వేల కోట్లు దోచేయడం.. ఆరోగ్యశ్రీ బిల్లులు వందలకోట్లు బకాయిలు పెట్టడం వాస్తవం కాదా? రూ.1000లు దాటితే ఆరోగ్యశ్రీ అమలు అన్నది ఎక్కడ అమలవుతుందో ముఖ్యమంత్రి చెప్పాలి’’ అని పీతల సుజాత డిమాండ్ చేశారు.

Updated Date - 2023-10-07T19:32:59+05:30 IST