Raghurama: పొన్నవోలు సినీ నటుడిగా మారితే బాగుటుంది
ABN , First Publish Date - 2023-10-05T16:48:03+05:30 IST
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు(skill development case)లో ఏమీ లేదని ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) వ్యాఖ్యానించారు.
ఢిల్లీ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు(skill development case)లో ఏమీ లేదని ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) వ్యాఖ్యానించారు. గురువారం నాడు రఘురామ నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సుప్రీంకోర్టు(Supreme Court)లో ఈ కేసు సోమవారం తేలిపోతుంది. కె.అజయ్‌రెడ్డి కడప అతను.. ఏపీ ఎస్ఎస్‌బీసీ(AP SSBC) చైర్మన్ అయ్యారు. ముందు ప్రిలిమినరీ విచారణ అన్నారు. ఈ కేసులో ప్రభుత్వం వాదనలు చెల్లవు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం FIR నమోదు చేయాలి. విషయం లేకనే FIR నమోదు చేయలేదు. పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చెప్పిందే చెబుతున్నారని.. జడ్జి అన్నారని అన్ని ఛానల్స్‌లో వచ్చింది. పొన్నవోలు సినీ నటుడిగా మారితే బాగుటుంది. పవర్ డైలాగ్ చెప్పేవారు లేరు.. ఎంత తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చిన తప్పులేదు.ప్లీడర్ పొన్నవోలు అనే సినిమా తీస్తే బాగుంటుంది. పొన్నవోలు సుధాకర్ నిన్న కోర్టు బయట.. ఎందుకు ఫీల్ అయ్యారో అర్థం కావడం లేదు. గతంలో నా కేసులో పొన్నవోలు తీరును కోర్టు తిట్టని తిట్టు లేదు. ఏపీలో ఇప్పుడు ఉన్న పాలన పోవాలని పవన్ అన్నారు. టీడీపీకి ఉన్న అనుభవం, జనసేన ఉడుకురక్తం తోడు కావాలన్నారు. నా నియోజకవర్గంలో ఓటుకు రూ.5 వేలు చొప్పున జగన్ ఇవ్వొచ్చు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చంద్రబాబుకు 9వ తేదీన కోర్టులో న్యాయం జరగుతుంది. సుప్రీంకోర్టులో రిలీఫ్ వస్తుంది. రింగ్ రోడ్డు, ఫైబర్‌గ్రిడ్‌లో బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. లేని రింగ్‌రోడ్డులో ఇన్ని కేసులు పెడితే,.. అసలు రాజధాని లేపేసిన వారిపై కేసులు ఎందుకు పెట్టలేదు?’’ అని ఎంపీ రఘురామరాజు పేర్కొన్నారు.