Raghurama: జగన్‌రెడ్డికి.. టికెట్ కోసం ఆ వైసీపీ ఎంపీ 12 కోట్లు ఇచ్చారు
ABN , First Publish Date - 2023-10-07T16:39:02+05:30 IST
ఓ వైసీపీ ఎంపీ తన టికెట్ కోసం ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి 12 కోట్లు ఇచ్చారని ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) ఆరోపించారు.
ఢిల్లీ: ఓ వైసీపీ ఎంపీ తన టికెట్ కోసం ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి 12 కోట్లు ఇచ్చారని ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) ఆరోపించారు. శనివారం నాడు రఘురామ తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అతి తెలివితో వైసీపీ పార్టీకి కష్టాలు వచ్చాయి. వైసీపీ 600 కోట్లు తెచ్చుకుంటే , టీడీపీ ఎలక్ట్రోల్ బాండ్స్ ప్రకారం కేవలం 27 కోట్లు తెచ్చారు. పొన్నవోలు సుధాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి. జగన్ ఢిల్లీ వచ్చిన జీతాలు లేవు. నిర్మలా సీతారామన్‌ని ఇంకో 10 వేల కోట్లు అప్పు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అడిగారని తెలిసింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబును అక్రమ కేసులో అరెస్ట్ చేసినందుకు పోలీసులకు మాత్రం జీతాలు వచ్చాయి. 41 A నోటీసు ఇచ్చి మరీ అరెస్ట్ చేసినందుకు వారికి జీతాలు ఇచ్చారు. విద్యార్ధులకు ప్రశ్నాపత్రాలు ప్రింట్ వేయడానికి కూడా జగన్‌రెడ్డి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. జగన్ మాత్రం సీఎంగా ఉండాలి.. ఇతర పార్టీలో కూడా సీఎం ఎవరు ఉండాలో కూడా మీరే చెప్తారా...? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉన్నారో లేదో మీకెందుకు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘‘కాంతితో క్రాంతి’’ అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ప్రజలు స్వచ్చందంగా ముందుకు రావాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు.