Varla Ramaiah: ఆ కామెంట్లను చేసినందుకు సీఐడీ చీఫ్ సంజయ్ సిగ్గుతో తలదించుకోవాలి
ABN , First Publish Date - 2023-11-20T21:17:24+05:30 IST
ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది, అబద్ధం పాతివేయబడుతుందనేది టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో నిజమైందని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ( Varla Ramaiah ) వ్యాఖ్యానించారు.
అమరావతి : ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది, అబద్ధం పాతివేయబడుతుందనేది టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో నిజమైందని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ( Varla Ramaiah ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో వర్ల రామయ్య మాట్లాడుతూ...‘‘ఏపీ హైకోర్టు బెయిల్ ఇస్తూ చేసిన కామెంట్ చూసి సీఐడీ చీఫ్ సంజయ్ సిగ్గుతో తలదించుకోవాలి. దర్యాప్తు అధికారిని హైకోర్టు ఆ చెంప ఈ చెంప వాయించింది. దర్యాప్తు అధికారులు దిక్కుమాలిన దర్యాప్తు చేశారు. చంద్రబాబు చేసిన తప్పేమీ లేదని ప్రాసిక్యూషన్‌లో తేలింది. తప్పు చేసినట్లుగా ప్రూ చేయటంలో ప్రాసిక్యూషన్ ఘోరంగా విఫలమైంది.రాజకీయ కక్ష, ఈర్ష్య, ధ్వేషంతో 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును రిమాండ్ ఖైదీగా ఉంచారు. జగన్‌కు నైతిక విలువలు ఉంటే 53 రోజులు అనవసరంగా జైల్లో ఉంచినందుకు క్షమాపణ అడగాలి. 39 పేజీల ప్రాసిక్యూషన్ రిపోర్టులో చంద్రబాబు తప్పు చేసినట్లు ఎక్కడా లేదు. 53 రోజులు చంద్రబాబును ప్రజాసేవ నుంచి దూరంగా ఉంచే హక్కు మీకెవరిచ్చారు? ఈ కేసులో వాదించిన లూధ్రా, దొమ్మాలపాటి శ్రీనివాస్ బృందానికి అభినందనలు. యువనాయకుడు లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది’’ అని వర్లరామయ్య స్పష్టం చేశారు.