Varla Ramaiah: చంద్రబాబు కుటుంబంపై CM జగన్ కక్షగట్టారు
ABN , First Publish Date - 2023-10-12T15:23:46+05:30 IST
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు( Chandrababu Naidu)కుటుంబంపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కక్షగట్టారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) వ్యాఖ్యానించారు.
అమరావతి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు( Chandrababu Naidu)కుటుంబంపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కక్షగట్టారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) వ్యాఖ్యానించారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘చంద్రబాబు ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు అనిరూపిస్తానన్న సజ్జల రామకృష్ణారెడ్డి విసిరిన ఛాలెంజ్‌ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను స్వీకరిస్తున్నాను. బహిరంగ చర్చ ఎప్పుడు పెడతారో సజ్జల వెంటనే ప్రకటించాలి. మా నాయకుడు స్కిల్ కేసులో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని నేను నిరూపిస్తా. చంద్రబాబను ఎత్తేసిన సంగతి నాకు తెలియదు, నేను లండన్‌లో ఉన్నానని జగన్ చెప్పడం పెద్ద అబద్ధం. ఆ రోజు లండన్ నుంచి రఘురామిరెడ్డి, సంజయ్, సజ్జలతో వీడియో కాన్ఫరెన్స్‌లో జగన్ మాట్లాడింది నిజంకాదా? ఈ రకంగా చంద్రబాబును అరెస్టు చేస్తే.. జగన్ 43 వేల కోట్ల దోపిడీని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సహకరించినందుకు ఆయనకు ఎంతకాలం శిక్ష పడాలి? 17ఏ సెక్షన్ ప్రకారం కేసే ఉండదంటే.. ఇంక కేసును నిరూపించాల్సిన అవసరమేముంది? చంద్రబాబును జైలుకు పంపి జగన్ రాక్షసానందం పొందుతున్నారు. 11 ఏళ్ల నుంచి వ్యవస్థలను మేనేజ్ చేసి కోర్టు నుంచి తప్పించుకు తిరుగుతున్న జగన్ కోర్టు విచారణ చేస్తే శేష జీవితమంతా జైల్లోనే గడపాల్సి ఉంటుంది. మేం అధికారంలోకి వచ్చాక అవినీతి పరులను వదలం. ప్రస్తుతం చంద్రబాబును ఉంచిన బ్యారెక్‌లోనే జగన్‌ను పెడతాం’’ అని వర్లరామయ్య తీవ్రంగా హెచ్చరించారు.