KVP: రాహుల్ గాంధీ విషయంలో చంద్రబాబు‌కు కాంగ్రెస్ సీనియర్ నేత విజ్ఞప్తి..

ABN , First Publish Date - 2023-03-28T17:47:22+05:30 IST

రాహుల్ గాంధీ (Rahul Gandhi) సస్పెండ్ వేటుపై మండిపడ్డారు. అత్యంత గౌరవమున్న ప్రతిపక్ష నేత ఏపీ (AP)లో ఉన్నారని కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు (KVP Ramachandra Rao) అన్నారు.

KVP: రాహుల్ గాంధీ విషయంలో చంద్రబాబు‌కు కాంగ్రెస్ సీనియర్ నేత విజ్ఞప్తి..

విజయవాడ: రాహుల్ గాంధీ (Rahul Gandhi) సస్పెండ్ వేటుపై మండిపడ్డారు. అత్యంత గౌరవమున్న ప్రతిపక్ష నేత ఏపీ (AP)లో ఉన్నారని కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు (KVP Ramachandra Rao) అన్నారు. 1984లో నాదెండ్ల భాస్కరరావు సమయంలో చంద్రబాబు చేసిన పోరాటం ఎవరూ మరచిపోరన్నారు. 2002లో గుజరాత్ మారణహోమం తరువాత మోడీ నరహంతకుడు అని ధీరశాలి, యన్డీఎ కన్వీనర్‌‌గా ఉన్న చంద్రబాబు (Chandrababu) వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. కానీ రాహుల్ విషయంలో స్పందించడంలేదన్నారు. అలాగే ఏపీ సీఎం జగన్‌ (CM Jagan)పై కేవీపీ (KVP) ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత మాట్లాడరు.. నొరు‌విప్పరని విమర్శించారు. జనసేన ప్రజల్లో‌ విశ్వాసం ఉంది.. ప్రశ్నించడానికే పుట్టానని‌ చెబుతాడని, పొత్తులో ఉండి బయటకి స్పందించక పోయినా... కనీసం వారిని కలిసి కూడా ప్రశ్నించలేడా? అని కేవీపీ ప్రశ్నించారు. ఇలా అయితే రేపు ప్రజలకు ఆయన సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు. ఒకవిధంగా తాము, చంద్రబాబు మిత్ర పక్షాలమన్నారు. 2018లో ఢిల్లీలో చంద్రబాబు దీక్ష చేస్తే.. రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ వెళ్లి మద్దతు పలికారని గుర్తుచేశారు. చంద్రబాబు ఓటమి తరువాత ఆయన్ను కించపరచవద్దని రాహుల్ గాంధీ తమకు సూచించారని చెప్పారు.

నేడు రాహుల్ గాంధీ‌కి అన్యాయం చేస్తే ఏపీ నుంచి అడిగే వారే లేకుండా పోయారా? అని కేవీపీ ప్రశ్నించారు. రేపు మీ హక్కుల గురించి అడిగే అర్హత కోల్పోతారని మండిపడ్డారు. ఇది వైసీపీ, టీడీపీ (TDP), జనసేన (Janasena)లకు వర్తిస్తుందన్నారు. ఇష్టం ఉన్నా లేకున్నా.. ఇటువంటి సందర్భాల్లో అయినా ముందుకు రావాలి కదా? అని కేవీపీ ప్రశ్నించారు. దేశం మొత్తం ఏకం అవుతున్న‌ వేళ ఏపీ నుంచి ఒక్క ప్రజాప్రతినిధి లేకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ద్వారా ఏపీ లోని అన్ని రాజకీయ పార్టీలను అభ్యర్థిస్తున్నానని పేర్కొన్నారు.

బీజేపీ (BJP)‌కి వ్యతిరేకంగా మీరు పోరాటాలు‌ ఎలాగూ చేయరని, ఉద్యమాలు చేసే కాంగ్రెస్ (Congress), వామపక్ష పార్టీలను అణచివేసే కార్యక్రమాలు చెపట్టవద్దని‌ చేతులు జోడించి కోరుతున్నానని కేవీపీ చెప్పారు. ‘‘చంద్రబాబు‌కు నా విజ్ఞప్తి.. మీ శక్తి సామర్థ్యాల‌పై జూలు విదల్చండి. ఢిల్లీ కి మీ కార్య స్థానం మార్చి ఉద్యమంలోకి రండి. రేపు మీకు ఇలాంటి పరిస్థితి వస్తే మిమ్మలను ఎవరూ పట్టించుకోరు. రాహుల్ గాంధీ‌పై కేసు, శిక్ష, అనర్హత వేటు, బంగ్లా ఖాళీ అంశాలపై అందరూ ఆలోచన చేయండి. ఇప్పుడిప్పుడే స్పందన వస్తుంది. ప్రజాస్వామ్య పరిరక్షణకు జాతీయ ఉద్యమంగా మారబోతుంది. ఎఐసీపీ తరపున అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సమాజం హర్షించని ఈ నిర్ణయాలు అడ్డుకోకపోతే భావితరాలు మనలను చరిత్ర హీనులుగా మిగులుతాం.’’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-03-28T17:47:22+05:30 IST