AP NEWS: నందిగామలో విగ్రహాల తొలగింపు ఉద్రిక్తం.. టీడీపీ నేతల ధర్నా
ABN , First Publish Date - 2023-08-17T05:37:15+05:30 IST
ఎన్టీఆర్ జిల్లా(NTR Distt) నందిగామలో అర్ధరాత్రి నుంచి విగ్రహాలను తొలగించారు. ఎన్టీఆర్ విగ్రహాలను తొలగిస్తుండడంతో తెలుగుదేశం నేతలు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
నందిగామ(Nandigama): ఎన్టీఆర్ జిల్లా(NTR Distt) నందిగామలో అర్ధరాత్రి నుంచి విగ్రహాలను తొలగించారు. ఎన్టీఆర్ విగ్రహాలను తొలగిస్తుండడంతో తెలుగుదేశం నేతలు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నందిగామ గాంధీ సెంటర్ల(Nandigama Gandhi Centers) రోడ్లు విస్తరణలో భాగంగా విగ్రహాలను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. విగ్రహాల తొలగిస్తుండడంతో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. దీంతో విగ్రహాల తొలగింపు ప్రదేశానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. విగ్రహాలను తొలగిస్తుండడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య(Tangirala Soumya) ఇంటి వద్ద నుంచి గాంధీ సెంటర్‌కు బయలు దేరారు. దారి మధ్యలోనే సౌమ్యను పోలీసులు అడ్డుకున్నారు. విగ్రహాలను తొలగిస్తున్న పోలీసులపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులను కలసి మొమరండం ఇస్తామన్న వెళ్లనివడం లేదని పోలీసులపై తంగిరాల సౌమ్య మండిపడ్డారు. కోర్టు విగ్రహాల తొలగింపునకు అనుమతి ఇచ్చిందని టీడీపీ నేతలకు చెప్పినా వినకుండా రాద్దాంతం చేస్తున్నారని పోలీసులు మీడియాకు తెలిపారు.
రెచ్చగొట్టిన వైసీపీ నేతలు
నందిగామ గాంధీ సెంటర్ల రోడ్డులోనే వైసీపీ కార్యాలయం ఉండడంతో అక్కడ ఉన్న కొంతమంది వైసీపీ కార్యకర్తలు, నేతలు టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. అలాగే తంగిరాల సౌమ్య మీడియాతో మాట్లాడుతున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టారు. అక్కనుంచి వైసీపీ కార్యాలయం వైపు టీడీపీ నాయకులు బయలుదేరడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెచ్చగొట్టిన వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య , టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సౌమ్య ఫిర్యాదు చేశారు.