Kollu Ravindra: వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతోంది
ABN , First Publish Date - 2023-03-01T15:03:13+05:30 IST
ప్రభుత్వ విధానాలతో టెన్త్‌లో 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారని
కర్నూలు: వైసీపీ ప్రభుత్వం (YCP Government) ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC election) టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ఓట్లు కూడా వేసే అవకాశం లేకుండా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. అభ్యర్థులను ప్రలోభపెట్టి, బెదిరించి ఎన్నికలను ఏకపక్షం చేసుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. అయినా అభ్యర్థులు ధైర్యంగా పోటీకి ముందుకు వచ్చి పోటీ చేశారన్నారు. సీఎం జగన్ (Jagan) ఉపాధ్యాయులపై కక్ష సాధిస్తున్నారని తెలిపారు. విద్యావ్యవస్థలో ప్రాంతీయ భాషను అణగదొక్కేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ విధానాలతో టెన్త్‌లో 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారని చెప్పారు. ఇక ప్రశ్నించిన వారిపై పోలీస్ వ్యవస్థను వినియోగించుకొని కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. 10 లక్షల కోట్లు అప్పు చేసినా ఎక్కడా ప్రభుత్వ ఆస్తులు రూపొందించలేదని కొల్లు రవీంద్ర (Kollu Ravindra) చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: ఓటమి భారం.. దానికి తోడు పక్కనున్నవాళ్లు నవ్వారని అవమాన భారం.. భరించలేక అతడు ఎంతకు తెగించాడంటే..