Share News

Somireddy: మైనింగ్ చట్టం సీఎం జగన్‌రెడ్డి కాళ్ల కింద నలిగిపోతుంది

ABN , First Publish Date - 2023-10-27T17:13:20+05:30 IST

ఏపీలో మైనింగ్ చట్టం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కాళ్ల కింద నలిగిపోతోందని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రామోహన్‌రెడ్డి ( Somireddy Chandramohan Reddy ) అన్నారు.

Somireddy: మైనింగ్ చట్టం సీఎం జగన్‌రెడ్డి కాళ్ల  కింద నలిగిపోతుంది

నెల్లూరు: ఏపీలో మైనింగ్ చట్టం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కాళ్ల కింద నలిగిపోతోందని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రామోహన్‌రెడ్డి ( Somireddy Chandramohan Reddy ) అన్నారు. శుక్రవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘జిల్లా మంత్రికి సంబంధించిన వ్యక్తులే వచ్చి వారు చెప్పిన రేటుకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయా సంస్థల యజమానులు మంత్రి సన్నిహితులు బెదిరిస్తున్నారు. 2000 సంవత్సరాలు చరిత్ర కలిగిన సిద్ధలయ్య కొండను సైతం మంత్రి మనుషులు దోచుకుంటున్నారు. కోర్టు ఆర్డర్లు సైతం లెక్క చేయకుండా జిల్లా మంత్రి ఆధ్వర్యంలో దోచుకుంటున్నారు. జిల్లా మంత్రికి కోర్టు ఆర్డర్లు కూడా లెక్కలేదు. కోర్టులో ఫైల్ దోచుకున్న మంత్రి మనుషులే మైనింగ్‌ను దోచ్చుకుంటున్నారు. అందరి బిడ్డ అని చెప్పుకుంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అందరిని ముంచుతున్నారు. పేదలకు చెందిన భూములల్లో వారిని బెదిరించి 200 హిటాచీలతో మైనింగ్‌ను దోచుకుంటున్నారు. గిరిజనులను బెదిరించి వారి భూములను కూడా మైనింగ్ కోసం తవ్వేస్తున్నారు. ప్రతిపక్షాలను రోడ్ల మీదకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసులు అడ్డుకుంటున్నా మైనింగ్‌పై తమ పోరాటం కొనసాగుతునే ఉంటుంది. క్వారాజ్ టన్ను 50000 చొప్పున దోచుకుంటున్నారు. ముఖ్యమంత్రి ఫ్యాక్టరీలకు, మైనింగ్‌లకు రాయాల్టీ 10రేట్లు పెంచడంతో ఓనర్లు మైన్లు ఆపివేస్తున్నారు. లీజు అయిపోయిన మైన్లను రెన్యూవల్ చేయకుండా ఆపివేస్తున్నారు. మైనింగ్‌ను దోచుకుంటున్న వారి మీద చర్యలు తీసుకోకపోతే ఎంతవకైనా పోరాడుతాం’’ అని వైసీపీ ప్రభుత్వాన్ని, పోలీసు శాఖను సోమిరెడ్డి చంద్రామోహన్‌రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు.

Updated Date - 2023-10-27T17:13:20+05:30 IST