Share News

Somireddy : వ్యవసాయ శాఖ మంత్రి మాటలు హాస్యస్పదంగా ఉన్నాయి

ABN , First Publish Date - 2023-12-08T19:18:48+05:30 IST

నిమ్మ రైతులకు అపారంగా నష్టం వాటిల్లిందని వైసీపీ ప్రభుత్వం ( YCP GOVT ) వెంటనే స్పందించాలని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ( Somireddy Chandramohan Reddy ) తెలిపారు.

Somireddy : వ్యవసాయ శాఖ మంత్రి మాటలు హాస్యస్పదంగా ఉన్నాయి

నెల్లూరు: నిమ్మ రైతులకు అపారంగా నష్టం వాటిల్లిందని వైసీపీ ప్రభుత్వం ( YCP GOVT ) వెంటనే స్పందించాలని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ( Somireddy Chandramohan Reddy ) తెలిపారు. శుక్రవారం నాడు పొదలకూరు మండలం బిరుదవోలులో మిచౌంగ్ తుఫాన్ ప్రభావిత పంటలను పరిశీలించారు. రైతలను కలిసి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ... ఒక్క పొదలకురులోనే 10 వేల ఎకరాలు నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖ మంత్రి 14 ఎకరాలు మాత్రమే నష్టం జరిగిందని చెప్పడం హాస్యస్పదంగా ఉంది. ఏపీ ముఖ్యమంత్రి , వ్యవసాయ శాఖ మంత్రి కార్లు దిగకుండా ఉంటే తుఫాన్ నష్టాన్ని ఎలా అంచనా వేస్తారు. వారి సమస్యలు ఎలా తెలుస్తాయి. వరదల్లో నష్టపోయిన వారిని కనీసం పరామర్శించాలని ఈ జిల్లా కలెక్టర్‌కి కూడా లేదా. పార్లపల్లి గ్రామంలో తుఫాన్ కారణoగా గత నాలుగు రోజుల నుంచి కరెంటు లేక మంచినీటికి గ్రామస్తులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు’’ అని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-12-08T19:18:49+05:30 IST