Ganta Srinivasa Rao : ఏపీలో ప్రజాస్వామ్యం విషమ పరిస్థితుల్లో ఉంది
ABN , First Publish Date - 2023-10-08T16:15:10+05:30 IST
ఏపీలో ప్రజాస్వామ్యం విషమ పరిస్ధితుల్లో ఉందని టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) వ్యాఖ్యానించారు.
విశాఖపట్నం: ఏపీలో ప్రజాస్వామ్యం విషమ పరిస్ధితుల్లో ఉందని టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) వ్యాఖ్యానించారు. ప్రమాదంలో ప్రజాస్వామ్యం రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆదివారం నాడు నిర్వహించారు. ఈ సమావేశంలో గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ వైసీపీ ప్రభుత్వంలో దళిత డ్రైవర్‌ను హతమార్చి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ఉదంతాలు చూశాము. ప్రజల ప్రాణాలకు, ప్రజాస్వామ్యానికి విలువలు లేవు.. పార్టీలు, ప్రజాసంఘాలు ఏకతాటిపైకి రావాలి. ఎక్కడా తప్పు చేయనప్పుడు బెయిల్‌కు ఎందుకు వెళ్లాలి.. అనే దోరణితో మా నేత చంద్రబాబు ఉన్నారు. అందుకే క్వాష్ పిటీషన్ వేసి మా నిబద్ధత చూపించాము. చంద్రబాబు నాయుడిపై వేసిన కేసు ఎలాంటి అక్రమమైనదో అందరికీ తెలిసింది. జగన్ తాను బెయిల్‌పై బైటకు వచ్చాను కాబట్టే...ఎదుటి వారిపై బురద జల్లుతాననే ధోరణిలో ఉన్నారు. 151 స్ధానాల్లో గెలిచి జగన్ సాధించింది ఏంటి? జగన్.. ప్రజావేదిక కూల్చడం నుంచే తన పతనానికి నాంది పలికాడు. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాబోతోంది. విశాఖ నుంచి పాలన చేస్తామనడం పెద్ద ఫాల్స్.. ఇది దృష్టి మళ్లింపు రాజకీయాలు మాత్రమే. జగన్ విశాఖ వస్తే ఏంటి రాకపోతే ఏంటి’’ అని గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు.