Share News

Ganta Srinivasa Rao: వైసీపీ మంత్రులు ఆ మాటలు అనడానికి సిగ్గుగాలేదా..?

ABN , First Publish Date - 2023-10-13T21:32:24+05:30 IST

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన పడుతుంటే వైసీపీ మంత్రులు వెటకారాలు, ఎకసక్కాలు చేస్తున్నారు మీకు కనీసం సిగ్గుందా అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ganta Srinivasa Rao: వైసీపీ మంత్రులు ఆ మాటలు అనడానికి సిగ్గుగాలేదా..?

విశాఖపట్నం: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన పడుతుంటే వైసీపీ మంత్రులు వెటకారాలు, ఎకసక్కాలు చేస్తున్నారు మీకు కనీసం సిగ్గుందా అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ చంద్రబాబును జైల్లో పెట్టిన తర్వాత ఐదు కేజీలు బరువు తగ్గారని, భువనేశ్వరి స్వయంగా చెప్పారు. దాన్ని కూడా వైసీపీ నాయకులు ఎద్దేవ చేస్తున్నారు. బాధ్యతాయుత మంత్రులు కూడా డీహైడ్రేషన్ వస్తే, మాత్రలు వేసుకుంటే తగ్గిపోద్ది అంటూ విమర్శలు చేస్తున్నారు. అక్రమార్జన కేసులో జగన్ జైలుకు వెళ్లాడు. అప్పట్లో జైల్లో పెడితే వీఐపీ స్టేటస్ ఇచ్చారు. వసతులు కల్పించారు. జాతీస్థాయి నాయకుడిని, జైల్లో రూల్స్ పేరుతో వేధిస్తున్నారు. వసతులు కూడా కోర్టుల ఆదేశాల మేరకు ఇచ్చారు. తప్ప ప్రభుత్వం ఎలాంటి వసతులు ఇవ్వలేదు. తక్షణమే, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చంద్రబాబును చూపించి వైద్య సహాయం అందించాలి. క్యాపిటల్ అన్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధి కోరుకునే వ్యక్తులుగా ముందే స్వాగతించాం.. కానీ పాలన రాజధాని అంతా బోగస్ అని తర్వాత తేలింది. డైవర్స్ పాలిటిక్స్ కోసం తప్పితే ఈ ప్రాంతం కోసం జగన్ ఏం చేయలేదు. విజయసాయిరెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఎవ్వరికీ గౌరవం లేదు. వైవీ సుబ్బారెడ్డి వచ్చాడు. వాళ్లంతా ఎక్కడ వాళ్లు చెప్పాలి. ఈ వంద రోజులైనా హుందాగా బతకండి. ముఖచిత్రం ఏంటో మంత్రి బొత్ససత్యనారాయణకి తెలుసు. కాబట్టి విశాఖపట్నం భూములపైన గతంలో వైసీపీ నేతలు ఏం చేశారు. ఇప్పుడు ఏం చేశారు. అందరూ చూశారు.. రాష్ట్రంలో ఏ వైపు చూసినా, అన్యాయాలు ఆక్రమాలు తప్పితే మరేం లేదు’’ అని గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు.

Updated Date - 2023-10-13T21:32:24+05:30 IST