Chandrababu: పోలవరం నిర్వాసితులకు టీడీపీ అధినేత ఇచ్చిన భరోసా ఇదే..!
ABN , First Publish Date - 2023-02-18T13:37:13+05:30 IST
నిర్వాసితుల సమస్యను వివరించటం జరిగింది. చంద్రబాబు సానుకూలంగా స్పందించి మాట్లాడారు.
ఏలూరు: పోలవరం నిర్వాసితులకు టీడీపీ (TDP) అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) భరోసా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) నిర్మాణంతో ముంపుకు గురవుతున్న గ్రామాల్లో ఆర్ & ఆర్ ప్రక్రియలో భాగంగా 2017వ సంవత్సరంలో నిర్వాసితులు నివహిస్తున్న గృహాలకు సర్వేలు నిర్వహించి గ్రామ సభలు నిర్వహించి 2019లో అవార్డ్ పాస్ చేయటం జరిగింది. కానీ కొద్దిరోజుల క్రితం పేపర్ డ్రాఫ్ట్ నోటీఫికేషన్ (Paper Draft Notification) ఇచ్చి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్న అధికారుల దగ్గర ఉన్న ఇంటి విలువలో వైసీపీ ప్రభుత్వం (YCP Government) 2019 ఇంటి విలువలు కంటే భారీగా కోతలు విధించటంతో నిర్వాసితులు, అఖిలపక్షంతో కలిసి గ్రామ సభలను బహిష్కరించటం జరిగింది.
వేలేరుపాడు మండలానికి చెందిన అఖిలపక్ష నాయకులను నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) పర్యటనలో ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు తీసుకుని వెళ్ళి నిర్వాసితుల సమస్యను వివరించటం జరిగింది. చంద్రబాబు సానుకూలంగా స్పందించి మాట్లాడారు. నిర్వాసితులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, న్యాయం జరిగేవరకు అందరినీ కలుపుకుని ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలియజేశారు. చంద్రబాబు (Chandrababu)ను కలిసిన వారిలో తెలుగుదేశం నుంచి మండల పార్టీ అధ్యక్షులు అమరవరపు అశోక్, కొమ్మన వెంకటేశ్వరరావు, కరుటూరి రాధాకృష్ణ, అల్లాడ సత్తిబాబు, జాగర్లమూడి శ్రీకాంత్, నయిం, సుధాకర్, జనసేన (Janasena) నుంచి మండల అధ్యక్షులు గణేశుల ఆదినారాయణ, సీపీఐ (CPI) నుంచి బాడీస రాము, న్యూడెమోక్రసి నుంచి గడ్డల ముత్యాలరావు, కాంగ్రెస్ నుండి కొల్లూరి సత్యనారాయణ, సీపీఎం నుంచి మడివి దుర్గారావు ఉన్నారు.
ఇది కూడా చదవండి: Viral Video: బైక్‌పై ఈ కోతులు ఎంత బుద్ధిగా కూర్చున్నాయో.. డ్రైవింగ్ చేసిన కుర్రాడి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే..!