Share News

Goods Train: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

ABN , First Publish Date - 2023-12-11T09:00:07+05:30 IST

తమిళనాడులోని చెంగల్‌పట్టు సమీపంలో విల్లుపురం నుంచి తొండైర్‌పేటకు వెళ్లే గూడ్స్ రైలు ప్రమాదవశాత్తూ పట్టాలు తప్పింది. రైలులోని కనీసం ఎనిమిది కోచ్‌లు పట్టాలు తప్పడంతో రైల్వే సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.

Goods Train: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

చెన్నై: తమిళనాడులోని చెంగల్‌పట్టు సమీపంలో విల్లుపురం నుంచి తొండైర్‌పేటకు వెళ్లే గూడ్స్ రైలు ప్రమాదవశాత్తూ పట్టాలు తప్పింది. రైలులోని కనీసం ఎనిమిది కోచ్‌లు పట్టాలు తప్పడంతో రైల్వే సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదం సమయంలో గూడ్స్ రైలు 38 కోచ్‌లతో ప్రయాణిస్తోంది. రైలులో ఇనుప ఖనిజం, మెటల్ షీట్లు, ఇనప రాడ్‌లు ఉన్నాయి. మొత్తం 38 కోచ్‌ల్లో ప్రమాదం సమయంలో 8 పట్టాల తప్పాయి. ఈ ఘటనలో రైలులో మెటల్ వస్తువులు కింద పడడంతో రైలు పట్టాలు దెబ్బతిన్నాయి. రెస్క్యూ టీమ్‌లు వెంటనే స్పందించడంతో రైలు సర్వీసులకు తక్కువ సమయమే అంతరాయం ఏర్పడింది. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలపై విచారణ చేపట్టనున్నారు. గత అక్టోబర్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. చెన్నైలోని సబర్బన్ అవడి సమీపంలో రైలు నాలుగు ఖాళీ కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. రైలు అననూర్‌ షెడ్‌ నుంచి బయలుదేరి బీచ్‌ స్టేషన్‌కు వెళుతుండగా ఆవడికి చేరుకోగానే ఈ ఘటన జరిగింది. రైలు అవడి స్టేషన్‌లో ఆగలేదని, హిందూ కాలేజీ స్టేషన్‌కు సమీపంలో పట్టాలు తప్పిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Updated Date - 2023-12-11T09:00:14+05:30 IST