CWC meeting: రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీడబ్ల్యూసీ సమావేశం
ABN , First Publish Date - 2023-09-15T18:24:55+05:30 IST
మల్లికార్జున్ ఖర్గే(Mallikharjun kharge) అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) తొలి సమావేశం శనివారం హైదరాబాద్(Hyderabad) లో జరగనుంది. ఈ సందర్భంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections), 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు(Lokh sabha Elections) వ్యూహరచనపై పార్టీ చర్చించనుంది.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikharjun kharge) అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) తొలి సమావేశం శనివారం హైదరాబాద్(Hyderabad) లో జరగనుంది. ఈ సందర్భంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections), 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు(Lokh sabha Elections) వ్యూహరచనపై పార్టీ చర్చించనుంది. గెలుపే లక్ష్యంగా అందరూ కలిసి కట్టుగా పని చేయాలనే సందేశాన్ని క్యాడర్ కి అందించనుంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో(Bharath Jodo) యాత్ర విజయవంతం అయిన తర్వాత భారత్ జోడో యాత్ర 2.0ని చేపట్టడంపై కూడా కమిటీ చర్చలు జరిపే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC)లో 39 మంది సాధారణ సభ్యులు ఉన్నారు. వీరు శనివారం మొదటి సమావేశాన్ని నిర్వహిస్తారు. ఆదివారం అన్ని రాష్ట్రాల పీసీసీ నేతలు, సీఎల్పీ తదితరులతో సమావేశం నిర్వహించనున్నారు.
తెలంగాణపై స్పెషల్ ఫోకస్..
సీడబ్ల్యూసీ మీటింగ్ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలంతా హైదరాబాద్ కి తరలి రానున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు పాజిటీవ్ వాతావరణం ఉండటంతో దానిని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డారు అగ్రనేతలు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ ఆధ్వర్యంలో "మెగా ర్యాలీ" నిర్వహించనున్నారు. అదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections) కోసం ఐదు గ్యారంటీ హామీలను కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. రాజధానిలో CWC సమావేశం నిర్వహించడం, ఎన్నికల నేపథ్యంలో పార్టీ ప్రచారాన్ని పెంచడంతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కాంగ్రెస్ సర్వ శక్తులు ఒడ్డుతోందన్నమాట. దానికి తోడు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే(NDA)ను ఢీకొట్టాలనే వ్యూహంపై ఈ భేటీలో స్పష్టత వస్తుందని సమాచారం. ఇండియా కూటమి(INDIA Alliance) అవలంబించాల్సిన వ్యూహాలు తదితర అంశాలు సైతం చర్చకు రానున్నాయి. కూటమి సీట్ల పంపకంలో వేగం పెంచనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు చెప్పారు. పునర్వ్యవస్థీకరించిన CWCలో 39 మంది సాధారణ సభ్యులు, 32 మంది శాశ్వత ఆహ్వానితులు, 13 మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. వీరిలో 15 మంది మహిళలు, సాధారణ సభ్యులలో సచిన్ పైలట్, గౌరవ్ గొగోయ్ వంటి అనేక కొత్త ముఖాలు ఉన్నాయి.