Kaveri River Issue: సీడబ్ల్యూఎంఏ ఆర్డర్‌పై స్టే ఇవ్వండి: సీఎం సిద్ధరామయ్య

ABN , First Publish Date - 2023-09-20T17:39:15+05:30 IST

తమిళనాడు(Tamilnadu)కు కావేరీ జలాలు(Kaveri River) విడుదల చేయాలన్ని సీడబ్ల్యూఎంఏ(Cauvery Water Management Authority(CWMA)) ఆదేశాలపై స్టే ఇవ్వాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సుప్రీంకోర్టు(Supreme Court)కు విన్నవించారు. ఇరు రాష్ట్రాలకు చెందిన ఈ సమస్య పరిష్కారంలో జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరారు.

Kaveri River Issue: సీడబ్ల్యూఎంఏ ఆర్డర్‌పై స్టే ఇవ్వండి: సీఎం సిద్ధరామయ్య

చెన్నై:తమిళనాడు(Tamilnadu)కు కావేరీ జలాలు(Kaveri River) విడుదల చేయాలన్ని సీడబ్ల్యూఎంఏ(Cauvery Water Management Authority(CWMA)) ఆదేశాలపై స్టే ఇవ్వాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సుప్రీంకోర్టు(Supreme Court)కు విన్నవించారు. ఇరు రాష్ట్రాలకు చెందిన ఈ సమస్య పరిష్కారంలో జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరారు. కావేరీ జలాల సమస్యపై కేంద్ర మంత్రులు, అఖిలపక్ష ఎంపీలతో సమావేశం నిర్వహించిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ... సీడబ్ల్యూఎంఏ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించాలని కోరుతున్నామని, దీనిపై తాము అప్పీల్ చేస్తామని చెప్పారు. 'తమిళనాడుకు నీటిని విడుదల చేయాలన్న సీడబ్ల్యూఎంఏ ఆదేశాలపై నిషేధం విధించాలనే డిమాండ్ తో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. మేము CWMA కి వాస్తవ పరిస్థితిని వివరించాం. ఆగస్టులో రాష్ట్రంలో 123 ఏళ్లలోనే అత్యల్ప వర్షపాతం నమోదైంది. దీంతో మాకు తాగు, సాగు, పరిశ్రమలకు నీరు లేకపోవడంతో ఇబ్బందుల్లో ఉన్నాం. ప్రధాని ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో సమావేశమయిన అనంతరం తదుపరి నిర్ణయాలు తీసుకుంటాం. కర్ణాటకలో 195 కరువు పీడిత ప్రాంతాలను గుర్తించాం. ఇందుకు సంబంధించిన నివేదికను సైతం కేంద్రానికి అందజేస్తాం" అని సీఎం అన్నారు. కావేరీ నదీ జలాల పంపిణీ వివాదంపై చర్చించేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Sidda Ramaiah) అధ్యక్షతన కేంద్ర మంత్రులు, కర్ణాటకకు చెందిన అఖిలపక్ష ఎంపీలతో ఢిల్లీలో సమావేశం నిర్వహించారు.


డీకే శివకుమార్ స్పందిస్తూ..

సమావేశంలో పాల్గొన్న ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shiva Kumar).. రాష్ట్రంలో తాగడానికి కూడా నీళ్లు లేవని పార్లమెంట్ సభ్యులు తమ పోరాటానికి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారని డీకే అన్నారు. "మేము చాలా కష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. ప్రస్తుతం కేవలం మూడింట ఒక వంతు నీరు మాత్రమే కలిగి ఉన్నాం. CWMA 15 రోజుల పాటు 5 వేల క్యూసెక్కుల నీరు తమిళనాడుకి ఇవ్వాలని ఆదేశించింది. మాకు తాగడానికి కూడా చుక్కా నీరు లేకుండా ఉంది. మాకు న్యాయం జరగకపోతే పోరాటం చేస్తాం. తమ పోరాటానికి మద్దతు ఇస్తామని ఎంపీలు హామీ ఇచ్చారు. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం”అని డీకే పేర్కొన్నారు.

Updated Date - 2023-09-20T17:46:59+05:30 IST