Crime News: ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన కారు.. బైకులో వచ్చి వెనుకే ఆగిన యువకులు.. కాసేపటి తర్వాత ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Dec 29 , 2023 | 09:11 PM
కొందరు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంటాయి. అలాగే మరికొందరు చిన్న చిన్న కారణాలకే ఎదుటి వ్యక్తుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా..
కొందరు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంటాయి. అలాగే మరికొందరు చిన్న చిన్న కారణాలకే ఎదుటి వ్యక్తుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా, ఢిల్లీలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కారులో కొందరు ఉద్యోగులను ఎక్కించుకుని వెళ్తూ ట్రాఫిక్‌లో ఆగిపోయాడు. కాసేటిపికి అతడి వెనుకే కొందరు యువకులు బైకులో వచ్చి ఆగారు. దారి విషయంలో వారి మధ్య జరిగిన గొడవ.. చివరకు ఎంత వరకూ వెళ్లిందంటే..
దక్షిణ ఢిల్లీలోని (South Delhi) మెహ్రాలీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక సంగం విహార్‌కు చెందిన మనోజ్ కుమార్ అనే వ్యక్తి.. గురుగ్రామ్‌లోని ఓ కంపెనీలో క్యాబ్ డ్రైవర్‌గా (Cab driver) పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా గురువారం సాయంత్రం అతను మాల్వియా నగర్ నుంచి ఐదుగురు ఉద్యోగులను కారులో ఎక్కించుకుని.. మరో ఉద్యోగిని పికప్ చేసుకోవడానికి మెహ్రౌలీ ప్రాంతానికి బయలుదేరాడు. అయితే రాత్రి 8.40 గంటల ప్రాంతంలో కారు ట్రాఫిక్‌లో చిక్కుకుంది. అదే సమయంలో ముగ్గురు యువకులు బైకులో అక్కడికి వచ్చారు. కారు అడ్డుగా ఉండడంతో దారి ఇవ్వాలని మనోజ్‌ను అడిగారు. అయితే దారి ఇచ్చేందుకు అవకాశం లేకపోవడంతో అతను కుదరదని చెప్పాడు.
Viral Video: ఈ సైకిల్ ఇలా ఎందుకు ఉందబ్బా..! వింత సైకిల్‌ను చూసి ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..
దీంతో మనోజ్‌కు, సదరు యువకులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఇది కాస్తా కాసేపటికి పెద్ద గొడవగా మారింది. ఈ క్రమంలో వారిలో (accused attacked the person with knife) ఓ వ్యక్తి కత్తితో మనోజ్‌పై దాడి చేశాడు. ఛాతిపై పొడవడంతో తీవ్రగాయాలయ్యాయి. తర్వాత వారు అక్కడి నుంచి పారిపోయారు. అపస్మారక స్థితికి చేరుకున్న మనోజ్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే అతను మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలిచారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల్లో ఒకరైన మైనర్‌ను పట్టుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.