Viral News: ఇలాంటి ఇంటి ఓనర్లు ఎవరైనా ఉంటారా.. పై అంతస్తు నుంచి పశువుల అరుపులు వినపడడంతో.. అంతా వెళ్లి చూడగా షాకింగ్ సీన్..
ABN , First Publish Date - 2023-07-23T20:44:52+05:30 IST
ఇంటి యజమానులు ఒక్కొక్కరు ఒక్కోలా వ్యవహరిస్తుంటారు. ఒకరు అద్దె విషయంలో కఠినంగా వ్యవహరిస్తే.. మరికొందరు చిత్రవిచిత్రమైన నిబంధనలు విధించి అద్దెదారులకు చుక్కలు చూపిస్తుంటారు. ఇలాంటి ఇంటి యజమానుల గురించి ఇటీవల పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు...
ఇంటి యజమానులు ఒక్కొక్కరు ఒక్కోలా వ్యవహరిస్తుంటారు. ఒకరు అద్దె విషయంలో కఠినంగా వ్యవహరిస్తే.. మరికొందరు చిత్రవిచిత్రమైన నిబంధనలు విధించి అద్దెదారులకు చుక్కలు చూపిస్తుంటారు. ఇలాంటి ఇంటి యజమానుల గురించి ఇటీవల పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మనం చెప్పుబోయే ఇంటి యజమాని ఇందుకు పూర్తి విరుద్ధమని చెప్పొచ్చు. ఇంటి పై అంతస్తు నుంచి పశువుల అరుపులు వినిపిస్తుండడంతో చుట్టు పక్కల వారందరికీ అనుమానం కలిగింది. చివరకు వెళ్లి చూడగా.. షాకింగ్ సీన్ కనిపించింది. వివరాల్లోకి వెళితే..
చైనాలోని (China) సిచువాన్ ప్రావిన్స్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇక్కడ పెద్ద అపార్ట్‌మెంట్ ఉంది. అందులో చాలా మంది అద్దెకు ఉంటున్నారు. ఇదిలావుండగా, ఇటీవల ఈ యజమాని చేసిన నిర్వాకం స్థానికంగా తీవ్ర చర్చనీయాశంగా మారింది. ఐదో అంతస్తులో అతను ఆవుల పెంపకం (cow farming) చేపట్టాడు. దీనిపై మొదట్లో ఎవరికీ అనుమానం రాలేదు. అయితే రాను రాను ఆవుల అరుపులు, దుర్గంధంతో అపార్ట్‌మెంట్ (Apartment) వాసులతో పాటూ చుట్టు పక్కల వారికి అనుమానం వచ్చింది. అపార్ట్‌మెంట్‌లో పశువుల అరుపులు రావడం ఏంటని అనుకుంటూ పైకి వెళ్లి చూశారు.
అక్కడ గుంపులుగా ఉన్న ఆవులను చూసి షాక్ అయ్యారు. ఇళ్లల్లో ఆవుల పెంపకం ఏంటంటూ యజమానిని నిలదీశారు. ఈ క్రమంలో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు అధికారులు, పోలీసులు కలుగజేసుకుని ఆశులన్నింటినీ ఖాళీ చేయించారు. ఏడు ఆవులను అక్కడి నుంచి మరో ప్రాంతానికి తరలించడంతో సమస్య సర్దుమణిగింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వార్త (Viral news) నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఆవులు పట్టణ జీవితాన్ని బాగా ఎంజాయ్ చేసినట్టున్నాయ్’’.. అని కొందరు, ‘‘ఈ ఇంటి ఓనర్ చాలా విచిత్రంగా ఉన్నాడే’’.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.