Viral News: బాత్రూంలో స్నానం చేస్తున్న యువతికి.. షాంపు బాటిల్ వెనుక షాకింగ్ దృశ్యం.. ఏంటా అని కంగారుగా బయటికెళ్లి చూడగా..

ABN , First Publish Date - 2023-07-23T18:48:18+05:30 IST

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఎంతో మంది స్మార్ట్ వర్క్ చేస్తూ ఇంట్లో కూర్చునే లక్షలు సంపాదిస్తున్నారు. మరికొందరు ఇదే టెక్నాలజీ సాయంతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి చివరకు జైలుపాలువుతన్నారు. ఈ క్రమంలో కొందరు శాడిస్టులు చేసే నీచమైన పనుల వల్ల ఎక్కువగా..

Viral News: బాత్రూంలో స్నానం చేస్తున్న యువతికి.. షాంపు బాటిల్ వెనుక షాకింగ్ దృశ్యం.. ఏంటా అని కంగారుగా బయటికెళ్లి చూడగా..
ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఎంతో మంది స్మార్ట్ వర్క్ చేస్తూ ఇంట్లో కూర్చునే లక్షలు సంపాదిస్తున్నారు. మరికొందరు ఇదే టెక్నాలజీ సాయంతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి చివరకు జైలుపాలువుతన్నారు. ఈ క్రమంలో కొందరు శాడిస్టులు చేసే నీచమైన పనుల వల్ల ఎక్కువగా యువతులే ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా, మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. స్నానం చేస్తున్న ఓ యువతికి ఉన్నట్టుండి షాపు బాటిల్ వెనుక షాకింగ్ దృశ్యం కనిపించింది. ఏంటా అనుకుంటూ కంగారుగా బయటికెళ్లి చూసి చివరకు షాక్ అయింది. వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని (Madhya Pradesh Indore) మల్హర్‌గంజ్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా కానిస్టేబుల్‌గా (Constable) పని చేస్తున్న ఓ వ్యక్తికి అన్మోల్ అనే కొడుకు ఉన్నాడు. ఇతడి తండ్రి కానిస్టేబుల్ కావడంతో చుట్టుపక్కల వారంతా యువకుడిని ఎంతో నమ్మేవారు. స్థానికంగా ఉండే యువతీయువకులంతా అన్మోల్‌తో సన్నిహితంగా ఉండేవారు. అయితే ఈ యువకుడు మాత్రం యువతులను వక్రదృష్టితో చూసేవాడు. ఈ క్రమంలో పక్కింట్లో ఉన్న యువతిని టార్గెట్ చేశాడు. ఇదిలావుండగా ఇటీవల ఓ రోజు సదరు యువతి స్నానం చేయడానికి (Young woman bathing) బాత్రూంలోకి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న అన్మోల్ అంతకు ముందే బాత్రూంలో కెమెరా అమర్చాడు.

Viral Video: కుక్క అరవడంతో తలుపు వైపు చూసిన వ్యక్తి.. ఏం జరుగుతుందోనని తెలుసుకునే లోపే ఊహించని షాక్.. చివరకు..

స్నానం చేస్తున్న యువతి మధ్యలో షాంపు బాటిల్ (Shampoo bottle) తీసుకోగా... దాని వెనుక వైపు కెమెరా (Camera) ఉండడాన్ని గమనించింది. అదేవిధంగా బయట ఎవరో ఉన్నట్లు అనుమానం కలిగింది. దీంతో కంగారుగా బయటికి వచ్చి చూడగా.. సదరు యువకుడు కెమెరా తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. యువతి కేకలు వేయడంతో చుట్టు పక్కల వారంతా అక్కడికి చేరుకున్నారు. విషయం తెలసుకుని అంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ చేస్తున్నామని, అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటన స్థానింగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Viral Video: తమ పెళ్లికి కేవలం స్నేహితులు మాత్రమే రావాలంటూ వధూవరుల కండీషన్.. చివరకు వీరంతా కలిసి కళ్యాణ మంటపంలో చేసిన పనేంటంటే..

Updated Date - 2023-07-23T18:51:36+05:30 IST