Rich Families of India: అంబానీ నుంచి టాటా వరకు.. భారత్‌లో ఈ 6 కుటుంబాలే అత్యంత సంపన్నులు..!
ABN , First Publish Date - 2023-08-19T16:30:49+05:30 IST
జనాభా లెక్కల ప్రకారం మన దేశం ఇప్పుడు అగ్రస్థానంలో ఉంది. 140 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నంబర్ వన్ ప్లేస్‌లో ఉంది. మరి, ఇంత జనాభా ఉన్నప్పుడు సంపన్నుల జాబితా కూడా గట్టిగానే ఉండాలి కదా! కానీ.. దురదృష్టవశాత్తూ చాలా తక్కువ మందే సంపన్నులున్నారు. చెప్పుకోవడానికి దేశంలో..
జనాభా లెక్కల ప్రకారం మన దేశం ఇప్పుడు అగ్రస్థానంలో ఉంది. 140 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నంబర్ వన్ ప్లేస్‌లో ఉంది. మరి, ఇంత జనాభా ఉన్నప్పుడు సంపన్నుల జాబితా కూడా గట్టిగానే ఉండాలి కదా! కానీ.. దురదృష్టవశాత్తూ చాలా తక్కువ మందే సంపన్నులున్నారు. చెప్పుకోవడానికి దేశంలో 302 మిలియన్లకు పైగా కుటుంబాలు ఉన్నా.. కేవలం ఆరంటే ఆరు మాత్రమే అత్యంత సంపన్న కుటుంబాలున్నాయంటే మీరు నమ్ముతారా? అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. పదండి.. ఆ కుటుంబాలేవీ? ఎవరెవరి సంపాదన ఎంతుంది? అనే వివరాలు మేటర్‌లోకి వెళ్లి తెలుసుకుందాం...
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ (Adani Group Chairman Gautam Adani) .. కేవలం మూడేళ్ల వ్యవధి కాలంలో 120 బిలియన్ల డాలర్ల వ్యక్తిగత నికర ఆదాయంతో ఒక్కసారిగా ప్రపంచ కుబేరుల దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. అదానీ పెద్ద కుమారుడు జీత్ ప్రస్తుతం సిమెంట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అలాగే ఆయన భార్య ఆదానీ ఫౌండేషన్ బాధ్యతలను చూసుకుంటోంది. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం.. 2022 నాటికి అదానీ కుటుంబ నికర విలువ 150 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన గౌతమ అదానీపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. అదానీ గ్రూప్ అకౌంటింగ్ మోసాలతో పాటూ స్టాక్స్‌ను తారుమారు చేస్తోందని అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ అనే ప్రముఖ రీసెర్చ్ సంస్థ గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే.
ఇక బిర్లా కుటుంబం కూడా అత్యంత సంపన్న కుటుంబాల జాబితాలో ఉంది. సేథ్ శివ్ నారాయణ్ బిర్లా 1857లో పత్తి వ్యాపారంతో తన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఆదిత్య బిర్లా (Aditya Birla) గ్రూప్‌కు అధిపతిగా వ్యవహరిస్తున్న కుమార్ మంగళం బిర్లా.. సెమాల్ట్ నుంచి టెలికాం రంగం వరకూ బిర్లా సంస్థను అగ్రగామిగా తీర్చిదిద్దారు. వీరి కుటుంబ నికల విలువ 15.5 బిలియన్ డాలర్లుగా ఉంది. బిర్లా గ్రూప్ కార్యకలాపాలు.. ముంబై ప్రధాన కేంద్రంగా ప్రస్తుతం 36 దేశాల్లో కొనసాగుతున్నాయి. కుమార మంగళం 1995లో బిర్లా గ్రూప్‌కు చైర్మన్‌గా ఉన్న సమయంలో 2బిలియన్ డాలర్లుగా ఉన్న సంస్థ ఆదాయం.. 2022కు 60 బిలియన్ డాలర్లకు పెరిగింది.
బజాజ్ (Bajaj Group) కుటుంబానికి కూడా భారత దేశ సంపన్న కుంటుంబాల్లో ప్రత్యేక స్థానం ఉంది. జమ్నాలాల్ బజాజ్ 1926లో బజాజ్ గ్రూప్‍ను స్థాపించారు. ప్రస్తుతం నీరజ్ ఆర్ బజాజ్ (Neeraj R Bajaj) ఈ సంస్థకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆటో, ద్విచక్ర వాహనాలు, త్రీ వీలర్ల తయారీలో బజాజ్ సంస్థ గ్లోబర్ లీడర్‌గా పరిగణించబడుతోంది. ఇక ఆదాయం విషయానికొస్తే.. 2022నాటికి బజాజ్ కుటుంబం నికర విలువ 14.6 బిలియన్ డాలర్లుగా ఉంది.
దేశంలో గోద్రెజ్ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. గోద్రెజ్ సామ్రాజ్యానికి 124 సంవత్సరాల చరిత్ర ఉంది. అర్ధేషిర్ గోద్రేజ్ 1897లో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం అగ్రశ్రేణి కంపెనీలలో గోద్రెజ్ ఒకటిగా నిలిచింది. రియల్ ఎస్టేట్ నుంచి వివిధ రకాల ఉత్పత్తుల వరకూ విస్తరించింది. ప్రస్తుతం గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ చైర్మన్‌గా నిసాబా (Godrej Consumer Products Chairman Nisaba) వ్యవహరిస్తున్నారు. 2022నాటికి గోద్రెజ్ కుటుంబ ఆదాయం 13.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ కుటుంబానికి ముంబై సబర్బన్‌లో విస్తారమైన భూమి ఉంది. ఇది వారి కుటంబంలో అతి పెద్ద ఆస్తిగా మిగిలిపోయింది. గోద్రెజ్ ప్రపంచంలోనే మొదటిసారిగా 1918లో కూరగాయల నూనెతో తయారు చేసిన సబ్బును విడుదల చేసిన విషయం తెలిసిందే.
భారతదేశాన్ని పారిశ్రామికీకరణ వైపు నడిపించడంలో టాటా గ్రూప్ (Tata Group) సహకారం మరువలేనిది. టాటా గ్రూప్‌కు జమ్‌షెడ్జీ పునాది వేశారు. అనంతర కాలంలో ఈ సంస్థను రతన్ టాటా (Ratan Tata) ముందుండి నడిపించారు. ఈయన 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌కు చైర్మన్‌గా ఉన్నారు. రతన్ టాటా వ్యాపార రంగంలో అంచలంచెలుగా ఎదగడమే కాకుండా దాతృత్వంలో కూడా అంతే పేరు సంపాదించుకున్నారు. IIFL వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 ప్రకారం రతన్ టాటా నికర విలువ రూ.3,800 కోట్లుగా అంచనా వేయబడింది. టాటా తన ఆదాయంలో సుమారు 60-65% విరాళంగా అందించి తన గొప్ప మనసును చాటుకున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ (Reliance Industries Chairman Mukesh Ambani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంబానీ 2023 మే నాటికి 87.2 బిలియన్ల డాలర్ల నికర విలువతో ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా, ప్రపంచంలోనే 13వ ధనవంతుడిగా ఉన్నారు. ధీరూభాయ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను స్థాపించగా.. ప్రస్తుతం ఆయన మూడో తరం ఇషా, అనంత్, ఆకాష్ అంబానీ ఈ వ్యాపారాలను చూసుకుంటున్నారు. రిలయన్స్ చైర్మన్‌గా 2002లో పగ్గాలు చేపట్టిన ముఖేష్ అంబానీ.. కంపెనీని అత్యున్నత శిఖరాలకు చేర్చానడంలో ఎలాంటి సందేహం లేదు.