Lovers: కూలి పనికి ఉదయం వెళ్లి.. రాత్రికీ ఇంటికి రాని ప్రేమికులు.. మరుసటి రోజు గ్రామస్తుల కంటపడిన షాకింగ్ దృశ్యం..
ABN , First Publish Date - 2023-11-19T18:33:26+05:30 IST
ప్రేమ వ్యవహారాలు ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటాయో ఎవరూ చెప్పలేరు. కొందరు ప్రేమికులకు ఇంటి నుంచి సమస్యలు ఎదురైతే.. మరికొందరికి బయటి వారి నుంచి ఇబ్బందులు కలుగుతుంటాయి. కొందరు..
ప్రేమ వ్యవహారాలు ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటాయో ఎవరూ చెప్పలేరు. కొందరు ప్రేమికులకు ఇంటి నుంచి సమస్యలు ఎదురైతే.. మరికొందరికి బయటి వారి నుంచి ఇబ్బందులు కలుగుతుంటాయి. కొందరు అన్నీ అధిగమించి చివరకు తాము అనుకున్నది సాధిస్తుండగా.. మరికొందరు ప్రేమికులు ఉన్నట్టుండి ఊహించని నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ ప్రేమ జంటకు సంబంధించిన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఉదయం కూలి పనికి వెళ్లిన ప్రేమికులు.. రాత్రికీ ఇంటికి రాలేదు. మరసటి రోజు ఉదయం గ్రామస్తులు వెళ్లి చూడగా.. ఊరి బయట షాకింగ్ సీన్ కనిపించింది. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) సింగ్రౌలి జిల్లా బార్గవాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక పాద్రి గ్రామానికి చెందిన పవన్ కోల్ అనే యువకుడికి.. ఇదే గ్రామానికి చెందిన రాణి కోల్ అనే యువతితో (young woman) పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కొన్నాళ్లకే ప్రేమగా (love) మారింది. కుటుంబ సభ్యులకు తెలీకుండా ఇద్దరూ కలుసుకునేవారు. అయితే తర్వాత వీరి ప్రేమ విషయం రెండు కుటుంబాలకు తెలిసింది. అయినా ఎవరూ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దీంతో తమ పెళ్లికి ఎలాంటి ఇబ్బందీ లేదని ఇద్దరూ సంతోషించారు. అయితే ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. శనివారం ఉదయం కూలి పని కోసం ఇద్దరూ ఇంటి నుంచి బయటికి వెళ్లారు.
Viral Video: ఇది సినిమా గ్రాఫిక్స్ కాదు రియల్.. ఈ బైకర్ చేసిన విన్యాసం చూస్తే.. మతి పోవాల్సిందే..
అయితే రాత్రికీ వారు ఇంటికి రాలేదు. దీంతో తెలిసిన వారి ఇంటికి వెళ్లారేమో అని కుటుంబ సభ్యులు అనుకున్నారు. అయితే మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు ఊరి బయటికి వెళ్లగా.. పొలాల్లో షాకింగ్ సీన్ కనిపించింది. ఓ చెట్టుకు ప్రేమికులిద్దరూ ఉరి వేసుకుని కనిపించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలపై గాయాలు ఉండడంతో పాటూ వారి కాళ్లు నేలకు తాకి ఉండడంతో స్థానికులతో పాటూ పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమికులిద్దరూ ఎంతో సంతోషంగా ఉండేవారని, ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదన్నారు. వారి కుటుంబ సభ్యులే చంపేసి, ఉరికి వేలాడదీసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు.