Viral Video: వేడి వేడి సమోసాను ఎంతో ఇష్టంగా తింటున్న బాలిక.. మధ్యలో అనుమానం వచ్చి లోపల చూడగా.. షాకింగ్ సీన్..
ABN , First Publish Date - 2023-11-16T22:06:20+05:30 IST
హోటళ్లు, దుకాణాల్లో ఆహార పదార్థాల తయారీలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కొందరు వంటకాల తయారీలో దారుణంగా వ్యవహరిస్తుంటారు. కొన్నిసార్లు కొందరు నిర్లక్ష్యం ఇంకొందరికి ప్రాణసంకటం అవుతుంటుంది. ఇలాంటి..
హోటళ్లు, దుకాణాల్లో ఆహార పదార్థాల తయారీలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కొందరు వంటకాల తయారీలో దారుణంగా వ్యవహరిస్తుంటారు. కొన్నిసార్లు కొందరు నిర్లక్ష్యం ఇంకొందరికి ప్రాణసంకటం అవుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వేడి వేడి సమోసాను ఎంతో ఇష్టంగా తింటున్న బాలిక.. మధ్యలో అనుమానం వచ్చి లోపల చూడగా షాకింగ్ దృశ్యం కనిపించింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) మొహల్లా న్యూ ఆర్య నగరాలో ఈ ఘటన చోటు చేసుకుంది. హాపూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన ఇంటికి అతిథులు వస్తుండడంతో స్వీట్లు, సమోసాలు తీసుకెళ్లేందుకు షాపులోకి వెళ్లాడు. వేడివేడి సమోసాలు, స్వీట్లు తీసుకుని ఇంటికి తీసుకెళ్లాడు. కుటుంబ సభ్యులు, బంధువులందరికీ వాటిని పంచాడు. 13 ఏళ్ల బాలిక సమోసా తింటుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సమోసా సగం తిన్నాక అనుమానం వచ్చి అందులో చూడగా.. (dead lizard in samosa) చనిపోయిన బల్లి కనిపించింది. దీంతో ఒక్కసారిగా కేకలు పెడుతూ ఇంటి బయటకు వెళ్లి వాంతులు చేసుకుంది. విషయం తెలిసి కుటంబ సభ్యులు, చుట్టు పక్కల వారంతా కంగారుపడ్డారు. సమోసాలు తిన్న మిగతా వారంతా బలవంతంగా వాంతి చేసుకుని నోరు కడుక్కున్నారు.
అయితే సమోసాను తిన్న బాలిక.. అస్వస్థతకు గురవడంతో చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. స్వీట్ షాపు సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని బాధితులు ఆరోపించారు. వెంటనే షాపు యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశఆరు. అయితే దీనిపై షాపు యజమాని మాట్లాడుతూ.. సమోసాలో చనిపోయిన బల్లి ఉండడానికి ఆస్కారమే లేదన్నాడు. కావాలనే తమపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలగా స్పందిస్తున్నారు.