Share News

Viral Video: గాడిదతో డబ్ల్యూ డబ్ల్యూ ఫైట్.. చివరకు యువకుడు చేసిన పనికి మండిపడుతున్న నెటిజన్లు..

ABN , First Publish Date - 2023-11-04T19:17:34+05:30 IST

కొందరు జంతువులతో కావాలనే కెలుక్కుని మరీ ఇబ్బంది పెడుతుంటారు. తిరిగి దాడి చేయలేవనే ధైర్యంతో వాటిని చిత్రహింసలకు గురి చేస్తుంటారు. కుక్కలు, గేదెలు, గాడిదలు, గుర్రాలు తదితర జంతువులపై శాడిజాన్ని చూపిస్తూ శునకానందం పొందే వారిని చాలా మందిని చూస్తుంటాం. అయితే...

Viral Video: గాడిదతో డబ్ల్యూ డబ్ల్యూ ఫైట్.. చివరకు యువకుడు చేసిన పనికి మండిపడుతున్న నెటిజన్లు..

కొందరు జంతువులతో కావాలనే కెలుక్కుని మరీ ఇబ్బంది పెడుతుంటారు. తిరిగి దాడి చేయలేవనే ధైర్యంతో వాటిని చిత్రహింసలకు గురి చేస్తుంటారు. కుక్కలు, గేదెలు, గాడిదలు, గుర్రాలు తదితర జంతువులపై శాడిజాన్ని చూపిస్తూ శునకానందం పొందే వారిని చాలా మందిని చూస్తుంటాం. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి గాడిదపై తన ప్రతాపాన్ని చూపించడాన్ని చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ గాడిద ఇంటి ముందుకు వచ్చి నిలబడి ఉంటుంది. అదే సమయంలో కొందరు వ్యక్తులు కారులో అటుగా వెళ్తారు. అయితే గాడిదను చూడగానే వారిలో ఓ వ్యక్తి నేరుగా దాని వద్దకు వెళ్తాడు. గాడిద ముందు కాళ్లు పట్టుకుని పైకి లేపుతాడు. వెనుక కాళ్ల మీద నిలబడి ఉన్న గాడిదను పట్టుకున్న అతను.. ఉన్నట్టుండి దాన్ని తన వీపు (man lifted the donkey and throw ground) మీదకు వేసుకుని ధమేల్‌మని ఎత్తి కిందపడేస్తాడు.

Viral Video: ఈ గ్రామస్తులంతా రోడ్డు పని చేస్తున్నారనుకుంటే పొరపాటే.. తీక్షణంగా గమనిస్తే మాత్రం షాకవ్వాల్సిందే..

గాడిదను కింద వేయగానే.. తాను డబ్ల్యూ డబ్ల్యూ ఫైట్‌లో గెలిచినంత ఆనందంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ ఘటనను మొత్తం కారులో ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వీడు అసలు మనిషా కాదా’’.. అని కొందరు, ‘‘మూగజీవులను హింసించడం పాపం..నేరం’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నాలుగు మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: అర్ధరాత్రి ఇంట్లోకి సడన్‌గా భర్త రావడంతో.. ప్రియుడిని కూలర్‌లో దాచిన భార్య.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..

Updated Date - 2023-11-04T19:18:13+05:30 IST