Viral Video: ఈ గ్రామస్తులంతా రోడ్డు పని చేస్తున్నారనుకుంటే పొరపాటే.. తీక్షణంగా గమనిస్తే మాత్రం షాకవ్వాల్సిందే..
ABN , First Publish Date - 2023-11-04T18:11:11+05:30 IST
కొన్ని గ్రామాల్లో ప్రజలు వింత ఆచారాలు పాటిస్తూ... వింత వింత పనులు చేస్తుంటారు. ఇంకొందరు తమ గ్రామాల్లో కొన్ని కట్టుబాట్లకు కట్టుబడి ఉంటారు. టెక్నాలజీ ఎంత మారినా ఇలాంటి వారు మాత్రం వారి కట్టుబాట్లను విడిచిపెట్టరు. ఈ క్రమంలో కొందరు...
కొన్ని గ్రామాల్లో ప్రజలు వింత ఆచారాలు పాటిస్తూ... వింత వింత పనులు చేస్తుంటారు. ఇంకొందరు తమ గ్రామాల్లో కొన్ని కట్టుబాట్లకు కట్టుబడి ఉంటారు. టెక్నాలజీ ఎంత మారినా ఇలాంటి వారు మాత్రం వారి కట్టుబాట్లను విడిచిపెట్టరు. ఈ క్రమంలో కొందరు గ్రామస్తులు చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి గ్రామాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వీడియోలో గ్రామస్తులంతా కలిసి రోడ్డు పని చేస్తున్నట్లు ఉంది. అయితే చివరకు వారి నిర్వాకం తెలుసుకుని అంతా షాక్ అవుతున్నారు..
బీహార్లోని (Bihar) జెహనాబాద్లోని బిఘా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో ముఖ్యమంత్రి గ్రామ రహదారి పథకం కింద సిమెంట్ రోడ్డు (cement road) నిర్మాణం చేపట్టారు. రోడ్డు వేస్తే మంచిదే కదా అని మీరు అనుకోవచ్చు.. కానీ వేసిన రోడ్డును ఈ గ్రామస్తులు ఏం చేశారో తెలిస్తే షాకవకుండా ఉండలేరు. గ్రామంలో రోడ్లు అధ్వానంగా ఉండడంతో అధికారులు సిమెంట్ రోడ్లు మంజూరు చేశారు. కాంట్రాక్టర్లు గ్రామంలోని వివిధ వీధుల్లో సిమెంట్లు రోడ్లు వేశారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఉదయం వెళ్లి చూస్తే మాత్రం వేసిన రోడ్డు మాత్రం కనిపించలేదు. దీంతో షాక్ అయిన సిబ్బంది విచారించగా.. గ్రామస్తులంతా కలిసి రాత్రికి రాత్రే సిమెంట్ రోడ్డును (villagers stole the cement road) చోరీ చేసినట్లు తెలిసింది.
రోడ్డుపై వేసిన సిమెంట్, కంకర మిశ్రమాన్ని ఎత్తుకెళ్లి తమ ఇల్ల వద్ద వేసుకున్నట్లు తెలిసింది. కొందరైతే పట్టపగలే సిమెంట్ రోడ్డు మిశ్రమాన్ని ఎత్తుకెళ్తున్నారు. గతంలోనూ సిమెంట్లు రోడ్డు వేయగా ఇలాగే చేశారని అధికారులు తెలిపారు. ఆ ఊర్లో సిమెంట్లు రోడ్లు వేసేందుకు ప్రజలు అనుమతించడం లేదని చెబుతున్నారు. కాగా, గ్రామస్తులు సిమెంట్, కంకర మిశ్రమాన్ని ఎత్తుకెళ్లే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ గ్రామస్తులు చాలా వెరైటీగా ఉన్నట్టున్నారే’’.. అని కొందరు, ‘‘సిమెంట్ రోడ్డును చోరీ ఏంట్రా నాయనా’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి చోరీలు ఎప్పుడూ చూల్లేదు’’.. అని ఇంకొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.