Wife: పండుగ రోజు ఇంటికి రాని భర్త.. అర్ధరాత్రి ఉన్నట్టుండి ఫోన్‌లో ఫొటో చూసి ఖంగుతిన్న భార్య.. చివరకు...
ABN , First Publish Date - 2023-11-04T14:54:23+05:30 IST
వారిద్దరికీ ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. ఇన్నాళ్లు దంపతుల మధ్య ఎలాంటి సమస్యలూ లేవు. అయితే ఉన్నట్టుండీ కొన్ని నెలలుగా వారి మధ్య కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. ఈ గొడవలు కాస్తా చివరికి ఇంకా పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఓ రోజు...
వారిద్దరికీ ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. ఇన్నాళ్లు దంపతుల మధ్య ఎలాంటి సమస్యలూ లేవు. అయితే ఉన్నట్టుండీ కొన్ని నెలలుగా వారి మధ్య కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. ఈ గొడవలు కాస్తా చివరికి ఇంకా పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఓ రోజు ఊహించని ఘటన చోటు చేసుకుంది. పండుగ రోజు కూడా భర్త ఎంతకీ ఇంటికి రాకపోవడంతో భార్యకు అనుమానం కలిగింది. అర్ధరాత్రి ఉన్నట్టుండి ఫోన్‌లో ఫొటో చూసిన భార్య షాక్ అయింది. చివరకు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మీరట్‌లోని లోహియా నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కాశీరారం ప్రాంతానికి చకెందిన ఆదేశ్ అనే వ్యక్తికి 8 సంవత్సరాల క్రితం సీమ అనే యువతితో వివాహమైంది. ఇన్నాళ్లూ సంతోషంగా ఉన్న దంపతుల మధ్య ఇటీవల కొన్ని (Quarrels between couples) నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. భర్త తనను రోజు రోజుకూ దూరం పెట్టడాన్ని ఆమె భరించలేకపోయింది. మారడతాడులే అనుకుని ఇన్నాళ్లూ తనకి తాను సర్దిచెప్పుకొంటూ వచ్చింది. అయితే అతను మాత్రం ‘‘నువ్వంటే నాకు ఇష్టం లేదు’’.. అంటే వేధించడమే కాకుండా ఎక్కువగా బయట తిరుగుతూ ఉండేవాడు. వేరే మహిళతో వివాహేతర సంబంధం (extramarital affair) కొనసాగిస్తున్నాడని భార్యకు అనుమానం కలిగింది. ఈ విషయంలో తరచూ గొడవపడుతుండేవారు. ఇటీవల కర్వా చౌత్ పండుగ సందర్భంగా గ్రామంలోని వారంతా సంతోషంగా గడుపుతున్నారు.
అయితే ఆదేశ్ మాత్రం ఆరోజు ఇంటికి కూడా రాలేదు. దీంతో సీమ రాత్రంతా బాధపడుతూనే ఉంది. అర్ధరాత్రి అతడు వేరే మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటో చూసింది. దీంతో ఆమె మరింత ఆందోళనకు గురైంది. ఉదయమే ఎస్పీ కార్యాలయానికి వెళ్లి.. తన భర్త తనను పట్టించుకోవడం లేదంటూ ఫిర్యాదు చేసింది. ఆమె సమస్యను విన్న పోలీసులు.. విచారణ చేస్తామని, తర్వాత రావాలంటూ ఆమెను పంపించారు. అయితే ఆఫీసు నుంచి బయటికి వచ్చిన సీమ.. గేటు వద్దకు వచ్చి ఉన్నట్టుండి విషం సేవించింది. మహిళ విషం (poison) తాగడాన్ని గమనించిన పోలీసులు కంగారుపడ్డారు. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అయితే ఎంతకీ అంబులెన్స్ రాకపోవడంతో చివరకు పోలీసు వాహనంలోనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.