Crime news: పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన యువతికి సీఐతో పరిచయం.. ఓ రోజు ఉన్నట్టుండి అతనే ఇంటికి రావడంతో..
ABN , First Publish Date - 2023-10-14T16:48:04+05:30 IST
కొన్ని పరిచయాలు జీవితంలో ఉన్నతికి తోడ్పడితే.. మరికొన్ని పరిచయాలు జీవితాన్ని చివరికి సర్వనాశనం చేస్తుంటాయి. మహిళల విషయంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. తాజాగా...
కొన్ని పరిచయాలు జీవితంలో ఉన్నతికి తోడ్పడితే.. మరికొన్ని పరిచయాలు జీవితాన్ని చివరికి సర్వనాశనం చేస్తుంటాయి. మహిళల విషయంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. తాజాగా, బీహార్‌లో ఓ యువత విషయంలో ఇలాగే జరిగింది. రోడ్డు ప్రమాదం కేసుకు సంబంధించి పోలీస్ స్టేషన్ వెళ్లిన యువతికి.. సీఐతో పరిచయం ఏర్పడింది. అయితే ఓ రోజు ఉన్నట్టుండి చోటు చేసుకున్న ఘటనతో చివరకు ఏం జరిగిందంటే...
బీహార్ (Bihar) పాట్నా జిల్లా మల్సలామి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రామకృష్ణ అనే వ్యక్తి ఇదే ప్రాంతంలో సీఐగా పని చేస్తుండేవాడు. అయితే ఇటీవల ఈ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (road accident) ఓ వ్యక్తి మరణించాడు. ఈ కేసులో పరిహారం విషయంలో మృతుడి కుమార్తెతో సీఐ తరచూ మాట్లాడుతుండేవాడు. ఈ క్రమంలో అతడి కన్ను ఆమెపై పడింది. ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో వివిధ రకాలుగా ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఓ రోజు ఆమె ఏకాంతంగా ఉన్న (Indecent behavior towards young woman) సమయంలో బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
అప్పటి నుంచి ఆమెపై తరచూ అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో యువతికి వేరే వ్యక్తితో వివాహమైంది. అలాగే రామకృష్ణను కూడా దుల్హిన్‌బజార్ పోలీస్ స్టేషన్‌కి బదిలీ చేశారు. అయినా అతను మాత్రం ఆమెను తరచూ వేధిస్తూ ఉండేవాడు. ఇటీవల ఆమె సీఐతో మాట్లాడటం మానేసింది. దీంతో అతను నేరుగా ఆమె ఇంటికి వెళ్లి.. బలవంతంగా బైకుపై ఎక్కించుకుని పాట్నా ఎయిమ్స్ వైపు తీసుకెళ్లాడు. అయితే స్థానికులకు అనుమానం వచ్చి.. చివరకు సీఐను పట్టుకుని ఫుల్వారీ షరీఫ్ పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.