Viral News: వీడి తెలివి తెల్లారిపోనూ.. టాయ్‌లెట్ వస్తోందని పోలీసులకు చెప్పి బాత్రూంకు వెళ్లాడు.. కాసేపటికే అరుపులు కేకలు.. వెళ్లి చూస్తే..
ABN , First Publish Date - 2023-04-19T18:35:32+05:30 IST
చాలా మంది నేరస్థులు పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో అతి తెలివి ప్రదర్శిస్తుంటారు. ఏదో ఒకటి చేసి కేసు నుంచి బయటపడేందుకో.. లేదా పారిపోయేందుకో వివిధ రకాల ప్లాన్లు వేస్తుంటారు. కొందరైతే మరీ దారుణంగా పోలీసులే షాక్ అయ్యేలా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి..
చాలా మంది నేరస్థులు పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో అతి తెలివి ప్రదర్శిస్తుంటారు. ఏదో ఒకటి చేసి కేసు నుంచి బయటపడేందుకో.. లేదా పారిపోయేందుకో వివిధ రకాల ప్లాన్లు వేస్తుంటారు. కొందరైతే మరీ దారుణంగా పోలీసులే షాక్ అయ్యేలా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ వింత ఘటనకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి టాయ్‌లెట్ వస్తోందని పోలీసులకు చెప్పి బాత్రూంకు వెళ్లాడు. కొద్ది సేపటికి లోపలి నుంచి అరుపులు, కేకలు వస్తుండడంతో పోలీసులు వెళ్లి చూడగా షాకింగ్ దృశ్యం కనిపించింది. వివరాల్లోకి వెళితే..
ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) బిలాయ్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఫరీద్‌నగర్ సమీపంలోని స్మృతి నగర్‌లో ఏప్రిల్ 15న రాత్రి ఓ వ్యక్తి చోరీ (theft) చేసేందుకు ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. అయితే ఆ సమయంలో ఇంట్లో మహిళ (woman) ఒంటరిగా ఉండడం చూసి అతనిలోని శాడిస్టు నిద్రలేచాడు. ఆమెపై అఘాయిత్యానికి (Indecent behavior) పాల్పడిన అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. మరుసటి రోజు బాధితురాలి ఫిర్యాదు మేరకు.. పోలీసులు సంఘటన స్థలంలోని సీసీ కెమెరాలను (CC cameras) పరిశీలించారు. చివరకు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని స్థానిక పోలీసు ఔట్‌పోస్టు భవనంలోకి తీసుకెళ్లారు. అయితే ఇక్కడ సదరు యువకుడు అతి తెలివి ప్రదర్శించాడు.
టాయిలెట్ వస్తోందంటూ మరుగుదొడ్డికి వెళ్లాడు. లోపలికి వెళ్లిన కాసేపటికి అరుపులు, కేకలు వినిపించాయి. దీంతో పోలీసులు (police) కంగారుగా లోపలికి వెళ్లారు. బాత్రూంలో నోటిలో రక్తం కారుతున్న యువకుడిని చూసి షాక్ అయ్యారు. నిందితుడి విషం తాగి ఉంటాడని భావించి, వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు.. అతడు కాలిపోయిన బల్బును (bulb) నమిలి మింగే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఈ విషయం తెలిసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. చికిత్స అనంతరం అతన్ని డిశార్జి చేశారు. నిందితుడు మద్యానికి బానిసై దొంగతనాలకు అలవాటు పడినట్లు పోలీసులు తెలిపారు. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోద చేసి దర్యాప్తు చేస్తున్నారు.