Father: ఈ తండ్రి కథ తెలుసుకోవాల్సిందే.. రక్తం అమ్మి మరీ ఇంట్లోకి సరుకులు కొనుక్కొచ్చి.. కూతురి ఆకలిని తీర్చి.. చివరకు రైలు పట్టాలపై..

ABN , First Publish Date - 2023-04-19T15:25:42+05:30 IST

ఆ కుటుంబంపై విధి పగ బట్టింది. బాగా చదువుతున్న కూతురు ఉన్నట్టుండి ఊహించని విధంగా రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రాణాలతో బయటపడినా వెన్నెముక దెబ్బతినడంతో మంచానికే పరిమితమైంది. దీంతో అప్పటి దాకా సంతోషంగా ఉన్న ఆ కుటుంబం.. ఒక్కసారిగా..

Father: ఈ తండ్రి కథ తెలుసుకోవాల్సిందే.. రక్తం అమ్మి మరీ ఇంట్లోకి సరుకులు కొనుక్కొచ్చి.. కూతురి ఆకలిని తీర్చి.. చివరకు రైలు పట్టాలపై..

ఆ కుటుంబంపై విధి పగ బట్టింది. బాగా చదువుతున్న కూతురు ఉన్నట్టుండి ఊహించని విధంగా రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రాణాలతో బయటపడినా వెన్నెముక దెబ్బతినడంతో మంచానికే పరిమితమైంది. దీంతో అప్పటి దాకా సంతోషంగా ఉన్న ఆ కుటుంబం.. ఒక్కసారిగా కష్టాల్లోకి కూరుకుపోయింది. కూతురి వైద్యం కోసం భూములతో పాటూ చివరకు ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. ఆఖరికి ఇంట్లోకి సరుకుల కోసం తండ్రి తన రక్తం అమ్మాల్సి వచ్చింది. విధిలేని పరిస్థితుల్లో చివరకు ఆ తండ్రి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) సత్నా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా పరిధి ట్రాన్స్‌పోర్ట్ నగర్‌కు చెందిన ప్రమోద్ గుప్తా అనే వ్యక్తికి అనుష్య అనే కుమార్తె ఉంది. ప్రమోద్ స్థానికంగా ఓ దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. భార్య, పిల్లలలో సంతోషంగా ఉన్న వీరి కుటుంబంపై విధి చిన్న చూపు చూసింది. ఐదేళ్ల క్రితం ప్రమోద్ గుప్తా కూతురు (Daughter) రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి ఆమె ప్రాణాలతో బయపడ్డా.. వెన్నెముక దెబ్బతినడంతో మంచానికే పరిమితమైంది. కూతురును మామూలు మనిషిని చేయడానికి ప్రమోద్.. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎన్నో ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా ఫలితం మాత్రం లేదు.

Crime News: గోడకు తగిలించిన ల్యాప్‌టాప్ బ్యాగులోంచి కిందపడుతున్న రక్తపు చుక్కలు.. భయం భయంగానే అందులో ఏముందా అని ఓపెన్ చేసి చూస్తే..

father-and-daughter.jpg

ఈ క్రమంలో అప్పటి వరకూ దాచుకున్న నగదు మొత్తం అయిపోవడంతో పాటూ భూమి, ఆస్తులతో పాటు ఆఖరికి దుకాణం, ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. అయినా కూతురు ఆరోగ్యం ఏమాత్రం మెరగవకపోవడంతో మానసికంగా తీవ్రంగా (Mental depression) కుంగిపోయాడు. అనుష్య పదో తరగతిలో జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరచింది. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఆమెను ఘనంగా సన్మానించారు. ప్రభుత్వం నుంచి ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారు. అయితే ఇప్పటి వరకూ వారి నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఇటీవల ప్రమోద్ ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కనీసం తినడానికి కూడా తిండి లేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఇంటి సరుకుల కోసం ప్రమోద్.. తన రక్తాన్ని (Blood) కూడా విక్రయించాల్సిన పరిస్థితి వచ్చింది.

Viral News: పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుందో మహిళ.. సరిగ్గా 6 నెలల తర్వాత షాకింగ్ ట్విస్ట్.. టెస్టులు చేస్తే..!

దీనికితోడు ఇటీవల స్కూల్ ఫీజు కట్టమంటూ నోటీసు కూడా వచ్చింది. దీంతో ప్రమోద్ మరింత కుంగిపోయాడు. మంగళవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. వేకువజామున కూతురికి ఫోన్ చేసి.. ‘‘ ఇన్నాళ్లూ నిన్ను మామాలూ మనిషిని చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను.. కానీ అది సాధ్యం కాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో నాకు చావు తప్ప వేరే మార్గం కనిపించడం లేదు’’.. అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. ప్రమోద్ మృతి వార్త తెలియగానే స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. అయ్యో! ఎంత ఘోరం జరిగిందంటూ.. స్థానికులు కంటతడి పెట్టుకున్నారు.

Tea: టీ తాగిన వెంటనే చనిపోయాడో వ్యక్తి.. అతడి ఫోన్‌లోని వీడియోలను చూసి డెత్ మిస్టరీని బయటపెట్టిన పోలీసులు.. ఇంతకీ అసలు కథేంటంటే..!

Updated Date - 2023-04-19T15:25:42+05:30 IST