Crime News: డ్యూటీ నుంచి ఇంటికి వచ్చి బెడ్‌పై పడుకున్న మహిళా కానిస్టేబుల్.. ఎదురుగా గోడపై వింత దృశ్యం చూసి అనుమానం.. చివరకు..
ABN , First Publish Date - 2023-10-20T13:21:15+05:30 IST
ఆమె ఓ కానిస్టేబుల్. సమాజంలో ఎలాంటి చెడ్డపేరు లేకుండా జీవిస్తున్న ఆమెకు ఇంట్లోనే సమస్య మొదలవుతుందని ఊహించలేకపోయింది. తరచూ తనతో గొడవపడే భర్త.. చివరకు అలాంటి పని చేస్తాడని ఊహించలేదు. ఓ రోజు డ్యూటీ ముగించుకుని అలసిపసోయి బెడ్రూంలో పడుకుంది. అయితే ఎదురుగా...
ఆమె ఓ కానిస్టేబుల్. సమాజంలో ఎలాంటి చెడ్డపేరు లేకుండా జీవిస్తున్న ఆమెకు ఇంట్లోనే సమస్య మొదలవుతుందని ఊహించలేకపోయింది. తరచూ తనతో గొడవపడే భర్త.. చివరకు అలాంటి పని చేస్తాడని ఊహించలేదు. ఓ రోజు డ్యూటీ ముగించుకుని అలసిపసోయి బెడ్రూంలో పడుకుంది. అయితే ఎదురుగా గోడపై వింత దృశ్యం చూసి అనుమానం కలిగింది. చివరకు విచారించగా భర్త చేసిన నిర్వాకం బయటపడింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఘటియాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కవినగర్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్‌కు (Female Constable) వింత అనుభవం ఎదురైంది. ఆమె భర్త డబ్బుల విషయంలో తరచూ ఇంట్లో గొడవపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఇటీవల భార్యకు తెలీకుండా తన బంధువుకు రూ.10లక్షలు ఇచ్చాడు. ఈ విషయం నిదానంగా భార్యకు తెలిసింది. దీంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ విషయం పక్కన పట్టి మరో లక్ష రూపాయలు ఇవ్వాలంటూ భార్యతో గొడవపడేవాడు. ఒక్క రూపాయి కూడా ఇచ్చేంది లేదంటూ ఆమె తెగేసి చెప్పింది. దీంతో భార్యపై పగ పెంచుకున్నాడు.
తన కజిన్‌తో కలిసి చివరకు కుట్ర పన్నాడు. ఇంట్లోని బాత్రూం, బెడ్‌రూమ్‌లలో స్పై కెమెరాలు (Spy cameras) అమర్చారు. భార్య స్నానం చేసే క్రమంలో వీడియోలన్నీ రికార్డ్ చేసేవారు. ఈ క్రమంలో ఇటీవల ఆమె డ్యూటీ నుంచి ఇంటికి వచ్చింది. అలసిపోయి బెడ్‌రూమ్‌లో కాసేపు పడుకుంది. ఇంట్లో లైట్ ఆఫ్ చేయగానే ఎదురుగా గోడపై ఓ చిన్న ఎర్రటి బల్బు మాత్రం వెలుగుతూనే ఉంది. అనుమానం వచ్చి ఇల్లు మొత్తం పరిశీలించగా.. అలాంటివే చాలా చోట్ల ఉండడం కనిపించింది. బీరువాలో చూడగా నగలు, నగదు కనిపించలేదు. దీనిపై భర్తను ప్రశ్నించగా.. ఎవరికైనా చెబితే అసభ్యకర వీడియోలను వైరల్ చేస్తానని బెదిరించాడు. చివరకు ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.