Share News

Viral Video: ఎలుగుబంటి కోతి చేష్టలు చేయడం ఎప్పుడైనా చూశారా.. నిశ్శబ్ధంగా ఇంట్లోకి ప్రవేశించి.. చివరికి ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2023-10-20T11:13:59+05:30 IST

కోతి చేష్టల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇళ్లల్లోకి చొరబడి ఇష్టమొచ్చిన వస్తువులను ఎత్తుకెళ్లడం చూస్తుంటాం. అలాగే ఎవరి చేతుల్లో తినుబండారాలు కనిపించినా దౌర్జన్యంగా లాక్కోవడం కూడా చూస్తుంటాం. అయితే ఇలాంటి పనులు..

Viral Video: ఎలుగుబంటి కోతి చేష్టలు చేయడం ఎప్పుడైనా చూశారా.. నిశ్శబ్ధంగా ఇంట్లోకి ప్రవేశించి.. చివరికి ఏం చేసిందంటే..

కోతి చేష్టల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇళ్లల్లోకి చొరబడి ఇష్టమొచ్చిన వస్తువులను ఎత్తుకెళ్లడం చూస్తుంటాం. అలాగే ఎవరి చేతుల్లో తినుబండారాలు కనిపించినా దౌర్జన్యంగా లాక్కోవడం కూడా చూస్తుంటాం. అయితే ఇలాంటి పనులు ఇతర జంతువులు చేస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. అదే ఎలుగుబంటి ఇలాంటి పనులు చేస్తే మరింత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఓ ఎలుగుబంటి ఇలాగే చేసింది. నిశ్శబ్ధంగా ఇంట్లోకి ప్రవేశించిన ఎలుగుబంటి చివరకు ఫ్రిడ్జ్‌పై కన్నేసింది. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అమెరికాలో (America) ఈ ఘటన చోటు చేసుకుంది. ఎవరూ లేని సమయంలో ఎలుగుబంటి ఓ ఇంట్లోకి ప్రవేశించింది. ఇల్లు మొత్తం వెతికిన ఎలుబంటి.. చివరకు వంటింట్లోని ఫ్రిడ్జ్‌పై (fridge) కన్నేసింది. దాన్ని కాసేపు తేరిపారా చూసి చివరకు కింద భాగంలోని అరను కాలితో ఎంతో తెలివిగా తెరిచింది. అందులో ఏమున్నాయో చూసి.. చివరకు వాటిలో ఓ ప్యాకెట్‌ను సెలెక్ట్ చేసుకుంది.

Women: తల్లితో పాటూ స్కూటీలో వెళ్లి.. నది ఒడ్డున రాత్రంతా గుక్కపట్టి ఏడుస్తున్న నాలుగేళ్ల చిన్నారి.. ఉదయం స్థానికులు వెళ్లి చూడగా..

ఫ్రిడ్జ్‌లోని ఫుడ్ ప్యాకెట్ తీసుకుని ‘‘ఎవరూ చూడలేదు కదా’’.. అని అనుకుంటూ (bear stole a food packet) కోతి తరహాలోనే కిటికీ పైకి ఎగిరి, అటునుంచి అటే కిందకు దూకి బయటకు వెళ్లిపోయింది. ఈ ఘటన మొత్తం ఇంట్లోని సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఈ ఎలుగుబంటి చాలా ఫన్నీగా ఉందే’’.. అని కొందరు, ‘‘దీనికి మొత్తం కోతి బుద్ధులే వచ్చాయ్’’.. అని మరికొందరు, ‘‘ఫ్రిడ్జ్ ఆహార్ అలవాటైనట్లుంది’’.. అని ఇంకొందరు, అలాగే చాలా మంది ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: వామ్మో! రైలు క్యాంటిన్‌లో ఇలా కూడా జరుగుతుందా.. ప్రయాణికులను కలవరపెడుతున్న వీడియో..

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-10-20T11:13:59+05:30 IST

News Hub