Share News

Success story: తల్లిదండ్రులు వద్దంటున్నా.. అప్పు చేసి మరీ ట్రక్కు కొన్నాడు.. ప్రస్తుతం అతను ఏ రేంజ్‌లో ఉన్నాడో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-10-13T21:04:18+05:30 IST

‘‘అనుకుంటే కానిది ఏమున్నదీ.. మనిషి అనుకుంటే కానిది ఏమున్నదీ’’.. అని ఓ సినీ కవి అన్నట్లుగా పట్టుదలతో ప్రయత్నిస్తే కానిదంటూ ఏదీ ఉండదు. అయితే కొందరు తాము అనుకున్నది సాధించడానికి కొందరు ప్రయత్నాలు మొదలెడగారు.. కానీ...

Success story: తల్లిదండ్రులు వద్దంటున్నా.. అప్పు చేసి మరీ ట్రక్కు కొన్నాడు.. ప్రస్తుతం అతను ఏ రేంజ్‌లో ఉన్నాడో తెలిస్తే..

‘‘అనుకుంటే కానిది ఏమున్నదీ.. మనిషి అనుకుంటే కానిది ఏమున్నదీ’’.. అని ఓ సినీ కవి అన్నట్లుగా పట్టుదలతో ప్రయత్నిస్తే కానిదంటూ ఏదీ ఉండదు. అయితే కొందరు తాము అనుకున్నది సాధించడానికి కొందరు ప్రయత్నాలు మొదలెడగారు.. కానీ ఏమాత్రం ఇబ్బందులు ఎదురైనా వెంటనే వాటిని పక్కన పట్టేస్తుంటారు. అయితే మరికొందరు మాత్రం జరిగేవన్నీ మంచికే అనుకుంటూ తాము ఎంచుకున్న రంగంలో ముందుకు సాగుతుంటారు. చివరకు అనుకున్నది సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ప్రస్తుతం మనం చెప్పుకోబేయే వ్యక్తి ఈ కోవకే చెందుతాడు. ఒకప్పుడు తల్లిదండ్రులు వద్దంటున్నా.. వినకుండా అప్పు చేసి మరీ ట్రక్కు కొన్నాడు. ప్రస్తుతం అతను ఏ రేంజ్‌లో ఉన్నాడో తెలిస్తే షాక్ అవుతారు.

vrl-logistics.jpg

దేశంలోని అతి పెద్ద లాజిస్టిక్స్ కంపెనీలలో ఒకటైన VRL లాజిస్టిక్స్ కంపెనీ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. దీని యజమాని విజయ్ సంకేశ్వర్ ఈ స్థానానికి రావడానికి చాల కష్టపడ్డారనే విషయం చాలా మందికి తెలీదు. కర్ణాటకలోని (Karnataka) ధార్వాడ్ ప్రాంతానికి చెందిన ఈయన కుటుంబం.. ఒకప్పుడు ప్రింటింగ్ ప్రెస్ (Printing press) వ్యాపారం నిర్వహిస్తూ ఉండేది. అయితే విజయ్ సంకేశ్వర్ మాత్రం ఏదైనా ట్రక్కు (truck) తీసుకుని వ్యాపారం మొదలెట్టారని ముందు నుంచీ అనుకుంటూ ఉండేవాడు. ఓ రోజు ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేశాడు. అయితే వారికి ఇది ఇష్టం లేదు. అయినా విజయ్ మాత్రం వారి ఇష్టానికి విరుద్ధంగా ముందుకెళ్లాడు.


ట్రక్కు కొనేందుకు ఇంట్లో నుంచి ఎలాంటి డబ్బులూ తీసుకోకుండా.. తెలిసిన వారి వద్ద అప్పు చేశాడు. ఇలా 1976 సంవత్సరంలో ట్రక్కు కొని లాజిస్టిక్స్ వ్యాపారం (Logistics business) మొదలెట్టాడు. అయితే ఈ రంగంలో అనుభవం లేకపోవడంతో మొదట్లో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అయితే తర్వాత ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాడు. అలా 1994 సమయానికి ఏకంగా 150 ట్రక్కులకు యజమాని అయ్యాడు. అయితే ఆ తర్వాత 1990లో విజయానంద్ ట్రావెల్స్ పేరుతో బస్సులను కూడా ప్రవేశపెట్టి సంస్థను మరింత విస్తరించాడు. ప్రస్తుతం ఈ సంస్థ VRL లాజిస్టిక్స్ లిమిటెడ్‌గా ప్రసిద్ధి చెందింది. విజయ్ సంకేశ్వర్ లాజిస్టిక్స్‌ కంపెనీతో పాటూ కన్నడలో ఓ సినిమాను (Film production) కూడా రూపొందించాడు. విజయ్ జీవిత చరిత్రపై ఈయన కుమారుడు ఆనంద్ సంకేశ్వర్ ‘‘విజయానంద్’’ పేరుతో 2022లో సినిమాను నిర్మించాడు.

Printing-press-business.jpg

మరోవైపు, దేశంలో మరే ఇతర లాజిస్టిక్స్ కంపెనీకి లేనటువంటి వాహనాలు విజయ్ సంకేశ్వర్ కంపెనీకి ఉన్నాయి. దీంతో విజయ్ కంపెనీ పేరు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో (Limca Book of World Records) కూడా నమోదైంది. ప్రస్తుతం వీరి కంపెనీలో 4,816 వాహనాలు ఉన్నాయి. ఇక, విజయ్ సంకేశ్వర్‌కు ప్రస్తుతం రూ.70కోట్ల ఆస్తులు ఉన్నాయి. కేవలం ఐదేళ్లలోనే ఈ కంపెనీ షేర్లలో భారీ పెరుగుదల కనిపించడం విశేషం. అది ఎంతలా అంటే.. ఐదేళ్లలో కంపెనీ తన వాటాదారులకు 115.05 శాతం రాబడిని ఇచ్చేంత స్థాయికి వచ్చింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ.6,200 కోట్లకు పైగానే ఉంది. ఈయన్ను భారత ప్రభుత్వం 2020లో ప‌‌‌‌ద్మశ్రీ పురస్కారంతో సన్మానించింది. ప్రస్తుతం ఆయన ఈ కంపెనీ నిర్వహణ బాధ్యతలతో పాటూ కొడుకు ఆనంద్ సంకేశ్వర్‌తో కలిసి వింగ్ ఎనర్జీ ప్రాజెక్ట్‌లు, ఎయిర్ చార్టర్ సర్వీస్ వంటి వాటికి కూడా నాయకత్వం వహిస్తున్నారు.

Updated Date - 2023-10-13T21:04:54+05:30 IST